అంబులెన్స్‌లో క్రికెటర్లు.. అసలు కారణం ఇదే!

Out of the bus into an ambulance for New Zealand, అంబులెన్స్‌లో క్రికెటర్లు.. అసలు కారణం ఇదే!

ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు శ్రీలంక టూర్‌లో ఉంది. ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ 1-1తో సమం కాగా.. టీ20లు ఇవాళ్టి నుంచి ఇరు జట్ల మధ్య ప్రారంభం కానున్నాయి. ఇక ఈ రెండు సిరీస్‌ల మధ్య కొంత వ్యవధి ఉండగా క్రికెటర్లు లంక అందాలను చూడాలనుకున్నారు. అందులో భాగంగా ప్రముఖ పర్యాటక స్థలం క్యాండీకి వెళ్లారు. ఆ ప్రాంత అందాలను వీక్షించి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్ మొరాయించింది.

సాధారణంగా క్రికెటర్లు లగ్జరీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఇక ఆ బస్సుకు సంబంధించిన క్లచ్ విరిగిపోవడంతో అక్కడే నిలిచిపోయింది. దీనితో ఆటగాళ్లను ఎలాగైనా హోటల్‌కు చేర్చాలనే ఉద్దేశంతో అధికారులు అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న అన్ని రకాల వాహనాలను ఉపయోగించారు. అంబులెన్స్‌లను కూడా వాడారు. ఆర్మీ వాహనాలు, ఇతర వాహనాలలో కూడా వారు హోటల్‌కు చేరుకున్నారు. ఇక ఈ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *