హ్యాపీ న్యూ ఇయర్: కేక్ తయారుచేసుకోండిలా..!

కొత్త ఆశలు, కొత్త ఆశయాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో రానున్న కొత్త సంవత్సర వేడుకలకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే కొత్త సంవత్సరానికి కేక్ కట్ చేసి స్వాగతం పలుకుతుంటారు చాలా మంది. అయితే ఈ సమయంలో మార్కెట్లో కేక్‌ ఖరీదు ఎక్కువ ఉండటంతో పాటు.. నాణ్యత తక్కువగా ఉంటుంది. అందుకే కాస్త ఓపిక ఉంటే చాలు ఇంట్లోనే మనం కేక్‌ను చేసుకోవచ్చు. అంతేకాదు బయట చేసినవి ఎంత తిన్నా.. […]

హ్యాపీ న్యూ ఇయర్: కేక్ తయారుచేసుకోండిలా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 31, 2019 | 5:24 PM

కొత్త ఆశలు, కొత్త ఆశయాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో రానున్న కొత్త సంవత్సర వేడుకలకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే కొత్త సంవత్సరానికి కేక్ కట్ చేసి స్వాగతం పలుకుతుంటారు చాలా మంది. అయితే ఈ సమయంలో మార్కెట్లో కేక్‌ ఖరీదు ఎక్కువ ఉండటంతో పాటు.. నాణ్యత తక్కువగా ఉంటుంది. అందుకే కాస్త ఓపిక ఉంటే చాలు ఇంట్లోనే మనం కేక్‌ను చేసుకోవచ్చు. అంతేకాదు బయట చేసినవి ఎంత తిన్నా.. స్వయంపాకం టేస్ట్ వేరే కాబట్టి.. ఈ సంవత్సరం కేక్‌ను మీరే చేసుకోండిలా..!

కావలసిని పదార్థాలు మైదా: కప్పు చక్కెర: అరకప్పు చాక్లెట్ పొడి, వెన్న, నూనె, పెరుగు, నీళ్లు, వెన్న, పాలు: పావు కప్పు ఉప్పు: పావు చెంచా వంటసోడా: అర చెంచా బ్రౌన్ షుగర్: అరకప్పు వెనిగర్, వెనిల్లా ఎసెన్స్: చెంచా

తయారు చేసే విధానం: ముందుగా కేక్‌పాన్‌కు కొద్దిగా వెన్న రాసుకొని పెట్టుకోవాలి. ఓ గిన్నెలో మైదా, ఉప్పు, చక్కెర తీసుకొని కలపాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న, నూనె, చాక్లెట్ పొడి, నీళ్లు తీసుకొని వాటిని స్టవ్‌ మీద సిమ్‌లో పెట్టాలి. అది చిక్కాగా అయిన తరువాత దింపేసి మైదా మిశ్రమంలో కలపాలి. ఇంకో గిన్నెలో పెరుగు, పావు కప్పు నీళ్లు, వెనిగర్, వెనిల్లా ఎసెన్స్, వంటసోడా కలుపుకోవాలి. వీటంన్నింటిని మైదా మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఆ తరువాత కేక్‌ పాన్‌లోకి తీసుకోవాలి.

ఇక ముందుగా వేడి చేసుకున్న ఓవెన్‌లో ఈ కేకు పాత్రను ఉంచి 35-40నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. ఓవెన్ లేకపోతే.. ఆరు లీటర్ల కుక్కర్‌లో కప్పు ఉప్పు వేసి సన్నని మంటపై పెట్టుకోవాలి. కుక్కర్ వేడి అయ్యాక.. కేక్ పాత్రను అందులో ఉంచి మూత పెట్టాలి(విజిల్ పెట్టకూడదు). ఇలా 40 నిమిషాల్లో కేక్ తయారు అవుతుంది.

ఇక చివరగా ఐసింగ్ తయారు చేసుకోవాలి. ఓ పాన్‌లో వెన్న, వెనిల్లా ఎసెన్స్, బ్రౌన్ షుగర్, పాలు, చాక్లెట్ పొడి తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. ఆ మిశ్రమం చిక్కగా అయిన తరువాత దింపేసి కేకుపై సమానంగా పరచాలి. అంతే న్యూ ఇయర్ కేక్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం ఈ సంవత్సరం కేక్‌ను మీరే ట్రై చేయండి మరి.