TRS Leaders worry: టీఆర్ఎస్ నేతల్లో వర్రీ.. కేసీఆరే కారణం

TRS leaders in worry and the reason is KCR: ఊహించని వారికి పదవులు..ఆశించిన వారికి నిరాశ.. ఇది తాజాగా అధికార టీఆర్ఎస్ వర్గాల పరిస్థితి. పదవులు ఆశించి భంగపడుతున్న కొందరు గులాబీ తమ్ముళ్లు నిరాశలో పడ్డారు. మేరా నెంబర్ కబ్‌ ఆయేగా అంటూ ప్రగతి భవన్‌ వైపు ఎదురుచూస్తున్నారు. తమకు ఎక్స్‌టెన్షన్‌ దొరికితే రెండేళ్లు హాయిగా ఉందామని అనుకుంటున్నారు. మరీ కేసీఆర్‌ ఏం ఆలోచిస్తున్నారు? నామినేటేడ్‌ పదవుల పందేరం ఎప్పుడు? నామినేటెడ్ పదవుల విషయంలో […]

TRS Leaders worry: టీఆర్ఎస్ నేతల్లో వర్రీ.. కేసీఆరే కారణం
Follow us

|

Updated on: Feb 14, 2020 | 4:11 PM

TRS leaders in worry and the reason is KCR: ఊహించని వారికి పదవులు..ఆశించిన వారికి నిరాశ.. ఇది తాజాగా అధికార టీఆర్ఎస్ వర్గాల పరిస్థితి. పదవులు ఆశించి భంగపడుతున్న కొందరు గులాబీ తమ్ముళ్లు నిరాశలో పడ్డారు. మేరా నెంబర్ కబ్‌ ఆయేగా అంటూ ప్రగతి భవన్‌ వైపు ఎదురుచూస్తున్నారు. తమకు ఎక్స్‌టెన్షన్‌ దొరికితే రెండేళ్లు హాయిగా ఉందామని అనుకుంటున్నారు. మరీ కేసీఆర్‌ ఏం ఆలోచిస్తున్నారు? నామినేటేడ్‌ పదవుల పందేరం ఎప్పుడు?

నామినేటెడ్ పదవుల విషయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల్లో రోజు రోజుకి టెన్షన్ పెరుగుతోంది. పదవుల రెన్యువల్ కోసం నిత్యం కేసీఆర్, కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు నేతలు..మున్సిపల్ ఎన్నికలు ముగిసిన కూడా పదవుల విషయంలో క్లారిటీ లేదు. అసలు ఊహించని వారికి పెద్ద పెద్ద పదవులు వస్తుండటంతో నేతల్లో మరింత టెన్షన్ మొదలయింది…

టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేషన్లు, కమిషన్లు కలిపి 50 ఛైర్మెన్ పోస్టుల వరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. అయితే వీటిలో కమిషన్ల పదవి కాలం మినహా దాదాపు అన్ని కార్పొరేషన్‌ల పదవీ కాలం ముగిసింది. అయితే 2018 ఎన్నికలకు ముందు మూడు కార్పొరేషన్‌లకు మాత్రమే వన్ ఇయర్ పాటు పాటు ఎక్సటెన్షన్ ఇచ్చారు సీఎం…ఇప్పుడు వాటి పదవీ కాలం కూడా ముగిసినా రెన్యూవల్ చేయడం లేదు గులాబీ బాస్.

Also Read: Infighting in Telangana Telugu Desam party

అయితే అందరూ మునిసిపల్ ఎన్నికలు అవ్వగానే రెన్యూవల్ అవుతుందనుకున్నారు..కానీ అది దిక్కులేక పోగా…తాజాగా ఆర్టీఐ కమిషన్ పదవుల్లో టిఆర్ఎస్ పార్టీ నేతలు శంకర్ నాయక్, మహ్మద్ అమీర్‌లకు కూడా పదవులు రావడంతో మిగితా వారిలో టెన్షన్ మొదలయింది. అసలు నామినేటెడ్ పదవులపై పెద్దగా ఆశలు లేని వారికే ఇంత పెద్ద పదవులు వస్తున్నాయంటే..మనకు రెన్యూవల్ ఉంటుందా లేదా మన స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారా అనే అనుమానం నేతల్లో మొదలయింది. దీంతో రెన్యూవల్ కోసం కేసీఆర్‌, కేటీఆర్‌ దగ్గరకు నేతలు క్యూ కడుతున్నారు.

పాత వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.. దానిలో భాగంగానే ఇలా అలస్యం చేస్తున్నారనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. రెన్యువల్‌ కాకపోతే తమ పరిస్థితి ఏంటి అని వివిధ కార్పొరేషన్‌ల మాజీ చెర్మన్‌లు ఒకరి బాధను మరొకరు పంచుకుంటున్నారు.