Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • హైదరాబాద్‌లో లాలాపేట పరిధిలో సాధారణ ఇంటికి రూ.25 లక్షల కరెంట్ బిల్లు. మార్చి 6 నుంచి జులై 6 వరకు బిల్లు తీశారు. ఈ నాలుగు నెలల్లో 34,5007 యూనిట్లు విద్యుత్ వాడినట్లు చూపించి.. ఏకంగా రూ. 25,11,467 బిల్లు వేశారు.
  • అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు లో పిటిషన్. పిటిషన్ దాఖలు చేసిన అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు అయిన అచ్చెన్నాయుడు . ప్రస్తుతం విజయవాడలో జైల్లో ఉన్న అచ్చెన్నాయుడు. వెంటనే బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరిన న్యాయవాది. ఇప్పటికే ఏసీబీ కస్టడీ కూడా ముగిసిందని పిటిషన్ లో పేర్కొన్న న్యాయవాది. ఏసీబీ కోర్టు బెయిల్ పిటీషన్ ను సస్పెండ్ చేయడంతో హైకోర్టు ను ఆశ్రయుంచిన అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు.
  • హైదరాబాద్ కమిషనరేట్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2017 సంవత్సరంలో జరిగిన మైనర్ రేప్ కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైల్ శిక్ష విధించిన కోర్టు.
  • కృష్ణజిల్లా: మచిలీపట్నం సబ్ జైలు నుంచి కొల్లు రవీంద్రను రాజమండ్రి తరలింపు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు న్యాయమూర్తి అనుమతి. గత రెండురోజులుగా మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న కొల్లు రవీంద్ర. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి కొల్లు. అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ నేతలు నిరసన. సబ్ జైలుకు చేరుకుని నల్ల బ్యార్జ్ లతో నిరసన. భారీ బందోబస్తు తో కొల్లు రవీంద్ర ను తరలించిన పోలీసులు.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో కేటుగాడు అరెస్ట్. నకిలీ ఈపాస్ లు సృష్టించిన కేసులో అరెస్ట్. నిందితుడు ప్రకాశం జిల్లాకు చెందిన పవన్ కుమార్ గా గుర్తింపు. 73 మందికి ఫోర్జరీ చేసిన ఈపాస్ లు ఇచ్చినట్టు నిర్దారణ. హైదరాబాద్ లోని ఓ కన్సల్టెన్సీ కంపెనీలో పని చేస్తున్న పవన్.
  • పాఠశాల విద్య శాఖ కమిషనర్ కార్యక్రమంలో ఏసీబీ రైడ్స్. లకిడికపూల్ లోని పాఠశాల విద్య శాఖ కమిషనర్ కార్యక్రమంలో సూపరింటెండెంట్ , జూనియర్ అసిస్టెంట్ లు 40 వేలు లంచం తీసుకుంటుండగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. మేడ్చెల్ జిల్లా ఘట్కేసర్ లోని సాంటా మారియా స్కూల్ లో స్టేట్ సిలబస్ నుంచి సెంట్రల్ సిలబస్ ( సీబీఎస్ఈ ) గా మార్చడానికి ఎన్ఓసీ సర్టిఫికెట్ కోసం స్కూల్ వద్ద డబ్బులు డిమాండ్.

వాట్సాప్‌తో డబ్బులు దోచేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త!

Whatsapp Money Stealing, వాట్సాప్‌తో డబ్బులు దోచేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త!

అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు కాజేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పంథాలను ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దోపిడీ చేసేందుకు వాట్సాప్‌ యాప్‌ను ఎంచుకున్నారు. యూజర్లకు మెసేజ్‌లు పంపిస్తూ.. వాటి ద్వారా నగదును దోచేస్తున్నారు ఈ కేటుగాళ్లు.

ముందుగా నేరగాళ్లు వాట్సాప్‌లో మనీ రిక్వెస్ట్ మెసేజ్‌లను యూజర్లకు పంపిస్తున్నారు. ఇక వచ్చిన ఆ సందేశాన్ని ఓపెన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే చాలు.. బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బులు గల్లంతయినట్లే. ఒక్క సందేశాలు మాత్రమే కాదు.. క్యూఆర్ కోడ్‌ ఇమేజ్‌లను కూడా పంపించి నగదు అడుగుతున్నారు. ఈ కోడ్‌లను స్కాన్ చేస్తే మీ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయని నమ్మిస్తున్నారు. నిజానికి మనీ వారి ఖాతాలోకి జమ అవుతుంది. ఇలాంటి తరహా మోసాలు ఇప్పుడు ఎక్కువైపోయాయి. అంతేకాకుండా కొంతమంది బాధితులు ఈ బారిన పడి డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. అందుకే ఇలాంటి మెసేజ్‌లు వాట్సాప్‌కు వస్తే ఓపెన్ చేయకూడదని ఐటీ నిపుణులు యూజర్లను హెచ్చరిస్తున్నారు.

Related Tags