ఫ్రెష్ డేంజర్ బెల్స్.. చైనాలో మళ్ళీ వైరస్ ఇన్ఫెక్షన్లు !

చైనాలో మళ్ళీ వైరస్ ఇన్ఫెక్షన్లు పెరగడం బెంబేలెత్తిస్తోంది. ఇంపోర్టెడ్ కరోనా వైరస్ కేసులు 951 కి పెరిగాయని, అలాగే ఎలాంటి కరోనా పాజిటివ్ లక్షణాలు లేకున్నా వైరస్ కేసులు బయటపడుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. దీంతో బోర్డర్ కంట్రోల్ మెజర్స్ ని ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న చైనీయుల్లోని  చాలామందిలో  కరోనా పాజిటివ్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయని, ఇక రాజధాని బీజింగ్ దీర్ఘ కాలిక కరోనా వైరస్ ఎపిడమిక్ కంట్రోల్ నగరంగా మారవచ్ఛునని […]

ఫ్రెష్ డేంజర్ బెల్స్.. చైనాలో మళ్ళీ వైరస్ ఇన్ఫెక్షన్లు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 07, 2020 | 6:10 PM

చైనాలో మళ్ళీ వైరస్ ఇన్ఫెక్షన్లు పెరగడం బెంబేలెత్తిస్తోంది. ఇంపోర్టెడ్ కరోనా వైరస్ కేసులు 951 కి పెరిగాయని, అలాగే ఎలాంటి కరోనా పాజిటివ్ లక్షణాలు లేకున్నా వైరస్ కేసులు బయటపడుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. దీంతో బోర్డర్ కంట్రోల్ మెజర్స్ ని ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న చైనీయుల్లోని  చాలామందిలో  కరోనా పాజిటివ్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయని, ఇక రాజధాని బీజింగ్ దీర్ఘ కాలిక కరోనా వైరస్ ఎపిడమిక్ కంట్రోల్ నగరంగా మారవచ్ఛునని నేషనల్ హెల్త్ కమిషన్ అధికార ప్రతినిధి ‘మీ ఫెంగ్’ తెలిపారు. వివిధ దేశాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో ఆ దేశాల్లోని తమ వారిని చైనా విమానాల ద్వారా తిరిగి స్వదేశానికి రప్పిస్తోంది. బహుశా ఈ కారణం వల్ల ఆదివారం నాటికి కరోనా ఇంపోర్టెడ్  కేసుల సంఖ్య 951 కి చేరినట్టు ఫెంగ్ పేర్కొన్నారు. ఉదాహరణకు చైనా-రష్యా సరిహద్దుల్లోని ‘సూఫెనే’ రాష్ట్రంలో 20 ఇంపోర్టెడ్ కేసులు బయటపడ్డాయన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం విదేశీయులనెవరినీ దేశంలోకి అనుమతించడం లేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఎలాంటి పాజిటివ్ లక్షణాలు లేకున్నా వైరస్ కేసులు పెరగడంతో తమ దేశంలో సెకండ్ వేవ్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయా అని చైనీయులు భయపడుతున్నారు. ఈనెల 4 న అయిదు లోకల్ కేసులు బయటపడ్డాయి కూడా. రెండు నెలల అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనాలో మళ్ళీ రెండో వేవ్ కరోనా కేసులు పుట్టుకురావడం నిజంగా ఆందోళన కలిగించే విషయమే. అయితే చైనీయులు తిరిగి పాములు, గబ్బిలాలు వంటివాటిని ఆహారంగా తీసుకుంటున్న కారణం కూడా దీనికి దారితీసినట్టు భావిస్తున్నారు.