Breaking News
  • బతకటం కాదు.. ఇతరులకు ఉపయోగపడేలా బతకటం గొప్ప. భౌతికంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దూరమయ్యారు. కానీ ఆయన గళం సంగీతం ఉన్నన్నాళ్లు బతికే ఉంటుంది: రామ్ గోపాల్‌ వర్మ.
  • గాన గంధర్వుని మృతికి తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ప్రగాఢ సంతాపం. 'బాలు'కి నివాళిగా రేపు (26-శనివారం) రికార్డింగ్ థియేటర్స్ మూసివేతకు పిలుపు. 16 భాషల్లో నలభై వేల పాటలు పాడిన 'కారణజన్ముడు' ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు ప్రముఖ గాయని-'తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్' అధ్యక్షురాలు విజయలక్ష్మి. రేపు (26-శనివారం) రికార్డింగ్ థియేటర్స్ అన్నీ స్వచ్చందంగా మూసివేయాలని.. గాయనీగాయకులంతా పాటల రికార్డింగ్స్ కు దూరంగా ఉండాలని.. తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆర్.పి.పట్నాయక్, కార్యదర్శి లీనస్, కోశాధికారి రమణ శీలం పిలుపునిచ్చారు. కొవిడ్ నిబంధనలకు లోబడి గాన గంధర్వునికి ఘన నివాళి అర్పించేందుకు త్వరలోనే తేదీని ప్రకటిస్తామని విజయలక్ష్మి తెలిపారు.
  • దేశవ్యాప్త కోవిడ్ గణాంకాలు: 24 గంటల వ్యవధిలో మరణాలు 1,141. మొత్తం కోవిడ్ మరణాలు 92,290. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 58,18,571. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 9,70,116. దేశంలో మొత్తం రికవరీలు 47,56,164.
  • అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్ వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు. చాలామంది తమిళ కన్నడ సోదరులు ఆయన తెలుగు వాడంటే ఒప్ప్పుకునేవారు కాదు. బాలు మావాడు అని గొడవ చేసేవారు. అన్ని భాషలలోను పాడారు. అందరిచేత మావాడు అనిపించుకున్నారు. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం. ఆయన పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. : రాజమౌళి.
  • అమరావతి హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్, సిఐడి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేడపాటి బాల సత్యనారాయణ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • అమరావతి : ఎస్పీ బాలు కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్‌లో పరామర్శ. అమరావతి: దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ.చరణ్‌తో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. కళా, సాంస్కృతిక రంగానికి ఆయన మరణం తీరనిలోటని అన్నారు. ధైర్యంగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు.

నేతాజీ అదృశ్యం కేసులో షాకింగ్ ట్విస్ట్‌..! ఆ బాబా బోస్ కాదని చెప్పే నివేదిక అదృశ్యం..

New twist to Gumnami Baba mystery!, నేతాజీ అదృశ్యం కేసులో షాకింగ్ ట్విస్ట్‌..! ఆ బాబా బోస్ కాదని చెప్పే నివేదిక అదృశ్యం..

ప్రపంచంలోనే ఇంతటి సస్పెన్స్ ఎక్కడా ఉండదు కాబోలు. దేశ స్వాతంత్ర సమయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. ఆజాద్ హింద్ ఫౌజ్ నెలకోల్పి.. బ్రిటీష్ వారిని ఎదుర్కొనేందుకు ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కాదు. ఆయన మరెవరో కాదు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్. అయితే ఆయన జన్మదినం తప్పితే.. ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు మరణించారన్నది మాత్రం సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని వార్తలు వచ్చినా.. అవన్నీ ఫేక్ అని.. రష్యాలో జైలు జీవితం గడిపి.. ఆ తర్వాత అక్కడి నుంచి మన భారతదేశానికి వచ్చి…గుమ్నామీ బాబాగా జీవించారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ గుమ్నామీ బాబానే నేతాజీ అని వాదన వినిపించడంతో.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పుడు మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

గుమ్నామీ బాబాయే నేతాజీ అన్న వాదన సరైంది కాదని.. తాజాగా ఓ కమిషన్‌ తేల్చి చెప్పింది. దీనికి సంబంధించిన ఓ నివేదికను ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభకు సమర్పించింది. అయితే, ఆ సమర్పించిన నివేదికలో సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబోరేటరీ(సీఎస్‌ఎఫ్‌ఎల్‌) అందించిన ఎలక్ట్రోఫీరోగ్రామ్‌ నివేదిక ఆధారంగానే.. గుమ్నామీ బాబానే నేతాజీ కాదని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. అయితే ఈ నివేదికపై సాయక్‌ సేన్‌ అనే బోస్ అభిమాని ఒకరు ఎలక్ట్రోఫీరోగ్రామ్‌ నివేదిక ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన సీఎస్‌ఎఫ్‌ఎల్‌ కోల్‌కతా.. తమ వద్ద ఆ నివేదిక లేదని చేతులెత్తేసింది. ఆ నివేదిక కావాలంటే సీఎఫ్‌ఎస్‌ఎల్‌ డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

అయితే నేతాజీ అదృశ్యంపై నిజాలేంటో బహిర్గతం చేసేందుకు యూపీ సర్కార్.. జస్టిస్‌ విష్ణు సహాయ్‌ కమిషన్‌ని నియమించింది. దీనిపై విచారణ జరిపిన వారు.. గుమ్నామీ బాబా వాడిన వస్తువులు, బాబా దంతంపై సీఎస్‌ఎఫ్‌ఎల్‌ కోల్‌కతా జరిపిన ఎలక్ట్రోఫీరోగ్రామ్‌ నివేదికలో నేతాజీ, బాబా ఒకరు కాదని తేల్చింది. కానీ, తాజాగా ఇప్పుడు అలాంటి నివేదిక తమ వద్ద లేదని సీఎస్‌ఎఫ్‌ఎల్‌ చెప్పడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

సహాయ్‌ కమిషన్‌ 2005 నాటి ముఖర్జీ కమిషన్‌ రిపోర్టు ఆధారంగానే నివేదిక సమర్పించిందంటూ ఆర్టీఐ యాక్టివిస్ట్ సాయక్‌ సేన్‌ ఆరోపిస్తున్నారు. ముఖర్జీ కమిషన్‌ రిపోర్టులో ఎలక్ట్రోఫీరోగ్రామ్‌ లేదని.. ఇది డీఎన్‌ఏ పరిశీలనకు అత్యవసరమని.. ఆ రిపోర్టును కావాలనే ప్రభావితం చేశారని ఆరోపిస్తున్నారు.

అయితే ఈ హాట్‌టాపిక్‌పై నేతాజీ మనవడు, బెంగాల్‌ బీజేపీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్‌ బోస్‌ స్పందించారు. సాయక్‌ సేన్‌ ఆరోపణల్లో నిజం లేదన్నారు. సీఎస్‌ఎఫ్‌ఎల్‌ కేవలం నివేదిక తమ వద్ద లేదని మాత్రమే చెప్పిందని.. అంతమాత్రాన నివేదికే లేదనడం సరైంది కాదన్నారు.  మరి అసలు నిజాలు ఇంకా ఎప్పుడు బయటపడతాయో వేచి చూడాల్సిందే.

Related Tags