Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఎపిసోడ్‌లో న్యూ ట్విస్ట్! దిమ్మ తిరిగే విషయాలు

New twist in SVBC Prudhvi issue, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఎపిసోడ్‌లో న్యూ ట్విస్ట్! దిమ్మ తిరిగే విషయాలు

ప్రస్తుతం ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ ఆడియో టేపుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఓ మహిళా ఉద్యోగినితో పృథ్వీ మాట్లాడిన ఓ ఆడియో రికార్డు విషయం సంచలనంగా మారింది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీసి.. విచారణకు ఆదేశించారు. దీంతో నిజం తేలేదాక నేను ఆ పదవిలో ఉండనని పృథ్వీ రాజీనామా చేశారు. తన తప్పు లేకపోతేనే తిరిగి విధుల్లో చేరుతానని పృథ్వీ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆయనపై టీటీడీ విచారణ కొనసాగిస్తోంది. ఇందులో పలు ట్విస్ట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ఇద్దరి మహిళల ప్రమేయం ఇందులో ఉన్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఆడియోలో పృథ్వీతో పాటు మాట్లాడిన సదరు ఎస్వీబీసీ మహిళా ఉద్యోగిని ఎవరనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే.. దీనిపై ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసులో పీటముడి నెలకొంది. అలాగే.. పృథ్వీ ఎస్వీబీసీలో అక్రమంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల అంశం కూడా తెరపైకి రావడంతో దానిపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పుడు విజిలెన్స్ నివేదికపై పృథ్వీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Related Tags