సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్వేత డెత్ కేస్‌లో షాకింగ్ ఫ్యాక్ట్స్.!

సెప్టెంబర్ 18న అర్ధరాత్రి ఘట్కేసర్ లోని రైల్వే ట్రాక్ పై ప్రాణాలొదిలిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్వేత అనుమానాస్పద మృతి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్వేత, ప్రియుడు అజయ్ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. శ్వేత నుండి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పాస్ వర్డ్ తీసుకొని అప్లోడ్ చేసినట్లు అజయ్ పోలీస్‌ల ముందు ఒప్పుకున్నాడు. “సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినందుకు నాపై కేసు పెట్టారు.. నాపై […]

  • Venkata Narayana
  • Publish Date - 10:03 am, Thu, 22 October 20

సెప్టెంబర్ 18న అర్ధరాత్రి ఘట్కేసర్ లోని రైల్వే ట్రాక్ పై ప్రాణాలొదిలిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్వేత అనుమానాస్పద మృతి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్వేత, ప్రియుడు అజయ్ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. శ్వేత నుండి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పాస్ వర్డ్ తీసుకొని అప్లోడ్ చేసినట్లు అజయ్ పోలీస్‌ల ముందు ఒప్పుకున్నాడు. “సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినందుకు నాపై కేసు పెట్టారు.. నాపై కేసు పెట్టడంతో శ్వేతను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాను” అని అజయ్ పోలీస్ లతో తెలిపాడు. శ్వేత ఆత్మహత్య కేసులో అజయ్ పై అనుమానం ఉందంటున్న మృతురాలి తల్లిదండ్రులు.. అజయ్ తన కూతురును హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. గత నెల 18న ఇంటి నుండి అదృశ్యమైన శ్వేత.. అర్థరాత్రి బీబీనగర్ సమీపంలోని NFC నగర్ రైలు పట్టాలుపై శవంలా కనిపించింది. ఆత్మహత్య, హత్య అనే కోణంలో నడుస్తోన్న పోలీస్ విచారణ కొనసాగుతోంది. ‘మా శ్వేతను అజయ్‌ చంపాడు.. పోలీసుల అలసత్వం ఉంది’.. టీవీ9 తో పేరెంట్స్