Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

భవాని కథలో కొత్త ట్విస్ట్!

New Twist in Bhavani Story, భవాని కథలో కొత్త ట్విస్ట్!

భవానీ… ఎట్టకేలకు తల్లిదండ్రుల ఒడికి చేరుకుంది. 15 ఏళ్ల ఆమె నిరీక్షణకు శుభం కార్డు పడింది. భవానీని చూడగానే.. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. వారితో పాటు భవానీ కూడా కన్నీరు మున్నీరుగా విలపించింది.  చివరికి.. టీవీ9 స్టూడియోలో తల్లిదండ్రులను కలుసుకుంది భవానీ.  ఈ సందర్భంగా.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. టీవీ9కి, ఫేస్‌బుక్‌కి థాంక్యూ చెప్పుకున్నారు. మోహన్ వంశీ.. భవానీని ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ప్రధాన పాత్ర పోషించారు.

అయితే నిన్నటివరకు భవానీని అప్పగిస్తానన్న జయ ప్లేటు ఫిరాయించింది. వాళ్ళు భవానీకి అసలైన తల్లిదండ్రులు కాదని వాదిస్తోంది. డీ‌ఎన్‌ఏ టెస్టులు నిర్వహించాలని జయ డిమాండ్ చేస్తోంది. దీనిపై జయ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి సిద్ధమైంది.