Breaking News
  • క్వారంటైన్‌ కేంద్రాలుగా స్టార్‌ హోటళ్లు. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 12 హోటళ్లలో.. క్వారంటైన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన ఒడిశా ప్రభుత్వం. ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునేవారు.. డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ హోటళ్లలో ఉండొచ్చన్న ప్రభుత్వం. రోజుకు రూ.2,500 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటన.
  • కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకునే.. కొత్త ఔషధాన్ని సిద్ధంచేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా నయం చేస్తుందని ప్రకటన.
  • ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి.కనుంగో పదవీకాలం పొడిగింపు. రేపటితో ముగియనున్న బి.పి.కనుంగో పదవీకాలం. కనుంగో పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్బీఐ ప్రకటన.
  • కోత కాదు వాయిదా. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం. ప్రజాప్రతినిధుల జీతాలు వాయిదా. సీఎం నుంచి స్థానిక సంస్థల సభ్యుల వరకు.. 100 శాతం జీతాన్ని వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జీతాల్లో 60 శాతం వాయిదా. నాలుగో తరగతి ఉద్యోగుల జీతంలో 10 శాతం వాయిదా. మిగతా ఉద్యోగుల జీతంలో 50 శాతం వాయిదా. వాయిదా వేసిన జీతాలు మళ్లీ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.
  • ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌. ప.గో జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు. నిన్నటి వరకు ఒక్క కేసూ లేని జిల్లాలో ఒకేసారి బయటపడ్డ 14 కేసులు. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు గుర్తింపు. ఏపీలో మొత్తం 58కి చేరిన కరోనా కేసులు.

TRS Party: టీఆర్ఎస్‌లో కొత్త గోల.. నేతల్లో అదే టెన్షన్

తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో నామినేటెడ్ పదవులపై ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు ముగిసిపోవడంతో ఇక నామినేటెడ్ పదవులైనా దక్కుతాయన్న ఆశతో నేతలు, పార్టీ శ్రేణులు అధినేతల చుట్టూ తిరుగుతున్నారు
new tension in trs cadre, TRS Party: టీఆర్ఎస్‌లో కొత్త గోల.. నేతల్లో అదే టెన్షన్

TRS leaders and cadre in new worry over nominated posts: తెలంగాణలో ఎన్నికల సందడి ముగిసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు మాత్రమే మిగిలాయి. నాలుగేళ్ల పాటు పెద్ద ఓట్ల పండగలు లేవు. దీంతో గులాబీ కేడర్‌ ఇప్పుడు అంతా తెలంగాణ భవన్‌, ప్రగతి భవన్‌ల చుట్టూ క్యూలు కడుతున్నారు. తమకో పదవి కావాలంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. మరీ వారి కోరికను పెద్ద సార్‌ తీరుస్తారా? ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్.

2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి మున్సిపల్, సహకార ఎన్నికల వరకు తెలంగాణలో వరుస ఎన్నికలు జరిగాయి. ఇక చెప్పుకోదగ్గ ఎన్నికలు 2023 వరకు రాష్ట్రంలో లేవు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు …..ఇలా ఎక్కడో దగ్గర కొంత మంది నేతలు అవకాశం దక్కించుకున్నారు. ఇంకా అవకాశాలు రాని పదవులు లేని నేతలు గులాబీ పార్టీలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. నామినేటెడ్ పదవులు దక్కుతాయి అని ఆశతో వారంతా ఇప్పటినుంచే పైరవీలు మొదలుపెట్టారు.

ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే కెసిఆర్ కంట్లో పడడానికి చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా విభిన్నమైన కార్యక్రమాలు చేపట్టి కెసిఆర్ దృష్టిని ఆకర్షించేందుకు కొందరు ప్రయత్నిస్తే….మరికొందరు నేతలు ఏకంగా ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ఆయన కంట్లో పడ్డారు. తమ పదవి విషయం ఆలోచించాలని కొందరు కోరారు.

రాజ్యసభ పదవులు ఆశిస్తున్న నేతలు, ఎమ్మెల్సీ పదవుల కోసం వెయిట్ చేస్తున్న నేతలు.. ఈ పదవులు దక్కక పోతే భవిష్యత్ కోసం సీరియస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తప్పితే మళ్లీ అవకాశం రాదని భావిస్తున్న నేతలు.. కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ను కలిసి తమ మనసులో మాట చెప్పుకుంటున్నారట. మొత్తానికి ఈ మార్చిలో ఏదో ఒక పదవి సంపాదించాలని కొందరు గులాబీ తమ్ముళ్లు కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది.

Also read: Chandrababu Praja Chytanya yatra details

Related Tags