Breaking News
  • మధ్యప్రదేశ్ లో ఒకే ఇంట్లో 8 మందికి కరోనా పాజిటివ్. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా లో ఒకే ఫ్యామిలీ లో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడి. గతం లో ఒక ఇంటి సభ్యుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వెల్లడించిన అధికారులు. అన్ని కూడా కాంటాక్ట్ కేస్ లు.
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో 20 కరోనా హాట్‌స్పాట్ ప్రాతాలను పూర్తిగా సీల్ చేయనున్న ప్రభుత్వం. నిత్యావసర సరుకులను ఇళ్లకే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. వైద్య అవసరాలకు తప్ప హాట్‌స్పాట్ ప్రాంతాల వారు బయటకు వెళ్లేది లేదంటూ నిషేధాజ్ఞలు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా, ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల పర్యవేక్షణ.
  • చెన్నై విలుపురంలో కరోనా పాజిటివ్ వ్యక్తి ఐసోలేషన్ వార్డు నుండి పరారీ. గతనెలలో విలుపురం వచ్చిన ఢిల్లీకి చెందిన వ్యక్తి. కరోనా పాజిటివ్ తెలియగానే కలెక్టరేట్ లో‌ని ఐసోలేషన్ వార్డు నిండి పరారీ. ఆ వ్యక్తి ఆచూకి తెలపాలంటూ పోటో విడుదల చేసిన పోలీసులు.
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీలో మరిన్ని కఠిన ఆంక్షలు. బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో 20 కరోనా హాట్‌స్పాట్ ప్రాతాలను పూర్తిగా సీల్ చేయనున్న ప్రభుత్వం. నిత్యావసర సరుకులను ఇళ్లకే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం. వైద్య అవసరాలకు తప్ప హాట్‌స్పాట్ ప్రాంతాల వారు బయటకు వెళ్లేది లేదంటూ నిషేధాజ్ఞలు. ఈ ప్రాంతాల వారు బయటకు రాకుండా, ఇతరులెవరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల పర్యవేక్షణ.
  • తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ. విద్యుత్ సంస్థలు రీలివ్ చేసిన ఉద్యోగుల జీతాల చెల్లింపుపై నెలకొన్న సందిగ్ధతపై సుప్రీంకోర్టులో అప్లికేషన్ వేసిన ధర్మాధికారి కమిటీ. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు .

కరోనాపై పోరులో.. స్మార్ట్ ఉంగరాలు..!

కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనాతో పోరులో ప్రజలందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. వ్యాధి కట్టడికోసం బిగ్ డెటా నుంచి ఏఐ దాకా అన్ని అస్త్రాలను వినియోగిస్తున్నారు.
New study aims to use health data from a smart ring to identify coronavirus symptoms, కరోనాపై పోరులో.. స్మార్ట్ ఉంగరాలు..!

కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనాతో పోరులో ప్రజలందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. వ్యాధి కట్టడికోసం బిగ్ డెటా నుంచి ఏఐ దాకా అన్ని అస్త్రాలను వినియోగిస్తున్నారు. మరి ఈ యుద్ధంలో ముందు వరుసలో నులుచుని పోరాడేవారు ఎవరైనా ఉన్నారంటే వారు వైద్య సిబ్బంది మాత్రమే. ఈ నేపథ్యంలోనే యూనివర్శిటీ ఆఫ్ శాన్‌ఫ్రాన్సిస్కో (యూసీఎస్‌ఎఫ్), ఔరా స్మార్ట్ రింగ్స్ సంయుక్తంగా స్మార్ట్ ఉంగరాలను రూపొందిచాయి. వీటిని వైద్యులు నిరంతరం ధరించడం ద్వారా వారి ఆరోగ్య స్థితిగతులపై ముఖ్యంగా ఉష్ణోగ్రతలపై ఓ కన్నేసి ఉంచోచ్చు. కాస్తంత టెంపరేచర్ పెరిగినా సరే..తగు జాగ్రత్తలు తీసుకుని ఐసోలేషన్‌లోకి వెళ్లడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు.

కాగా.. యూసీఎస్‌ఎఫ్ మెడికల్ సెంటర్, జుకర్‌బర్గ్ శాన్‌ఫ్రాన్సిస్కో జనరల్ హాస్పిటళ్లలోని 2 వేల మంది సిబ్బంది వీటిని వినియోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఉంగరాల ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించడం ద్వారా కరోనా పూర్తి పట్టు లభిస్తుందని అశాభావం వ్యక్తమవుతోంది. ఉంగరం రూపకర్తలైన రెండు సంస్థలూ మరో 15 వేల మందికి ఈ ఉంగారలను ఇవ్వాలని తలపోస్తున్నాయి. వీరి నుంచి సేకరించిన డాటా ఆధారంగా ఉంగరంలోని ఆల్గోరిథంను మరింత పటిష్ట పరిచి కరోనాకు ముకుతాడు వేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. సాధారణ వ్యక్తులు కూడా వీటిని ధరించడం ద్వారా తమ ఆరోగ్యంపై పూర్తి నిఘా పెట్టోచ్చిని, ఈ వివరాలను వారు ప్రభుత్వంతో పంచుకుంటే కరోనాకు పూర్తిగా చెక్ పెట్టొచ్చని స్మార్ట్ ఉంగరం చెబుతున్నారు.

New study aims to use health data from a smart ring to identify coronavirus symptoms, కరోనాపై పోరులో.. స్మార్ట్ ఉంగరాలు..!

24/03/2020,8:55PM

Related Tags