పోలీసుల పేరుతో భారీ మోసం, ఈ సారి పెదకూరపాడు ఎస్సై టార్గెట్

తెలుగు రాష్ట్రాలలో పోలీసులు టార్గెట్ గా పెద్ద స్కామ్ నడుస్తోంది. పోలీసుల నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు క్రియేట్ చేసి , వారి ఫ్రెండ్ లిస్టులో ఉన్నవారికి డబ్బులు కావాలంటూ సందేశాలు పంపుతున్నారు దుండగులు. 

పోలీసుల పేరుతో భారీ మోసం, ఈ సారి పెదకూరపాడు ఎస్సై టార్గెట్
Follow us

|

Updated on: Sep 25, 2020 | 12:42 PM

తెలుగు రాష్ట్రాలలో పోలీసులు టార్గెట్ గా పెద్ద స్కామ్ నడుస్తోంది. పోలీసుల నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు క్రియేట్ చేసి , వారి ఫ్రెండ్ లిస్టులో ఉన్నవారికి డబ్బులు కావాలంటూ సందేశాలు పంపుతున్నారు దుండగులు.  ఇప్పుటికే పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ఈ సైబర్ కేటుగాళ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా  పెదకూరపాడు ఎస్సై పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఐడి క్రియేట్ చేశాడు గుర్తుతెలియని ఆగంతకుడు. తనకు అత్యవసరంగా డబ్బులు ఫోన్ పే లో పంపాలంటూ బంధువులకు, మిత్రులకు రిక్వెస్ట్ లు పంపాడు. ఎంత కావాలి లాంటి వివరాలు తెలుసుకోవడానికి బంధువులు ఫోన్ చెయ్యడంతో నకిలీ ఫేస్ బుక్ వ్యవహారం బయటపడింది. తన పేరుతో క్రియేట్ చేసిన నకిలీ పేస్ బుక్ ను నమ్మి ఎవరూ డబ్బులు పంపొద్దంటూ అందర్నీ రిక్వెస్ట్ చేసిన ఎస్సై, మోసంపై సైబర్ క్రైం కు ఫిర్యాదు చేశారు. మొత్తం నలభై మంది పోలీసు అధికారుల నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు క్రియేట్ చేసినట్టు సమాచారం అందుతోంది. ఈ దందా వెనుక జార్ఖండ్ కు‌ చెందిన వ్యక్తులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read :

‘పబ్​జీ’ ప్రేమాయణం, చివరకు !

ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

తాలుకు కూడా అదిరే రేటు !