ఒక్కసారి ప్రసారం చేసినా లైవ్ ‘కట్’ చేస్తారు.!

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ పై నిబంధనలను కఠినతరం చేసింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్ర కార్యకలాపాలకు మద్దతుగా నిలిచే ప్రసారాలపై ఆంక్షలు విధించింది. ఆ మేరకు సంస్థ పలు చర్యలు చేపట్టింది.

‘విద్వేష ప్రసారాలను అరికట్టేందుకు మేం ఏమి చేయగలమని ఆలోచించాం. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉండే దృశ్యాలను ఒక్కసారి ప్రసారం చేసినా అలాంటి వారు భవిష్యత్తులో లైవ్ స్ట్రీమింగ్ వినియోగించుకుండా నిషేధం విధిస్తాం. అంతేకాకుండా ఉగ్ర సందేశాలను షేర్ చేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఫేస్ బుక్ వైస్ ప్రెసిడెంట్ గాయ్ రోజెన్ తెలియజేశారు. ఇక ఈ నిబంధనలతో భవిష్యత్తులో న్యూజిలాండ్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని రోజెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *