అక్టోబర్‌లోనే చైనాలో ‘కరోనా’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టిందన్న స్పష్టత ఉన్నప్పటికీ.. అది ఎప్పుడు ఆవిర్భవించింది..? ముందు ఎవరికి సోకింది..?

అక్టోబర్‌లోనే చైనాలో 'కరోనా'.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
Follow us

| Edited By:

Updated on: May 18, 2020 | 9:52 PM

గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టిందన్న స్పష్టత ఉన్నప్పటికీ.. అది ఎప్పుడు ఆవిర్భవించింది..? ముందు ఎవరికి సోకింది..? అన్న ప్రశ్నలు ఇప్పటికీ మిస్టరీగా మిగిలాయి. డిసెంబర్‌లో ఈ వైరస్‌ వ్యాప్తి మొదలైందని చైనా ప్రభుత్వం చెప్పినప్పటికీ.. అక్టోబర్‌లోనే ఈ వ్యాధి అక్కడ మొదలైనట్లు తెలుస్తోంది. 2019 అక్టోబర్‌లో వుహాన్‌లో జరిగిన ప్రపంచ సైనిక క్రీడల్లో పాల్గొన్న పలు దేశాల క్రీడాకారులు చెబుతున్న మాటలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.

వంద దేశాల నుంచి దాదాపు 10వేల మంది ఈ క్రీడల్లో భాగస్వామ్యం అవ్వగా.. వారిలో చాలామంది ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారని, కొందరిలో కరోనా లక్షణాలు కనిపించాయని తెలిసింది. ఈ క్రీడల్లో పాల్గొన్న ఫ్రెంచ్‌ పెంటాథ్లెట్ ఇలోడి క్లౌవెల్‌, ఆయన భాగస్వామి వాలెంటిన్‌ బెలాడ్‌కు కరోనా సోకింది. ఇక ఇటాలియన్‌ ఫెన్సర్ టగ్లిలారియోల్‌ సైతం వుహాన్‌లో తానున్న భవంతిలో అందరూ కోవిడ్-19 లక్షణాలతో అనారోగ్యం చెందారని చెప్పారు. ఇక జర్మన్ వాలీబాల్ క్రీడాకారిణి జాక్వలైన్‌ బాక్‌ సైతం చైనాలో క్రీడల్లో పాల్గొని వచ్చిన తరువాత తాను తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వివరించారు.

అంతేకాదు ఈ క్రీడాకారులందరూ పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. అక్టోబర్‌లో వుహాన్‌ నగర వీధులన్నీ నిర్జనంగా కనిపించాయని, అప్పుడే వీధులన్నీ ద్రావకాలతో పిచికారీ చేయడం చూశామని వారు చెప్పారు. వీటితో పాటు విమానాశ్రయంలో తమ ఉష్ణోగ్రతను రికార్డు చేశారని, క్రీడాకారులు క్యాంటీన్లోకి వచ్చి చేతులు శుభ్రం చేసుకునేవారని, అక్కడి వారు బయటి నుంచి ఆహారం తీసుకోవద్దని చెప్పడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని పలువురు అథ్లెట్లు చెప్పారు. దీంతో కరోనా విషయంలో చైనాపై మరోసారి అనుమానాలు మొదలయ్యాయి.

Read This Story Also: కరోనా పరీక్షలు ఎవరెవరికి చేయాలంటే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..!