అనుకున్న టైమ్‌కు శశికళ విడుదల అవుతారా?

జయలలిత బతికున్నంత కాలం పెత్తనం చేసిన శశికళ గ్రహచారం బాగోలేక జైలు పాలయ్యారు.. ఆదాయానికి మంచిన ఆస్తులు కూడబెట్టారంటూ చిన్నమ్మ అని ఆమె అనుచరగణం పిలుచుకునే శశికళతో పాటు ఇళవరసి,

అనుకున్న టైమ్‌కు శశికళ విడుదల అవుతారా?
Follow us

|

Updated on: Oct 31, 2020 | 11:36 AM

జయలలిత బతికున్నంత కాలం పెత్తనం చేసిన శశికళ గ్రహచారం బాగోలేక జైలు పాలయ్యారు.. ఆదాయానికి మంచిన ఆస్తులు కూడబెట్టారంటూ చిన్నమ్మ అని ఆమె అనుచరగణం పిలుచుకునే శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్‌లకు బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష ప్లస్‌ తలా పది కోట్ల రూపాయల జరిమానా విధించింది.. ఇప్పుడు శిక్షాకాలం ముగింపు దశకు వచ్చింది.. మహా అయితే ఆమె మరో రెండునెలల పాటు జైల్లో ఉంటారంతే! ఈ మాట చెప్పుకునే ఆమె అనుచరులు తెగ సంబరపడిపోతున్నారు.. చిన్నమ్మకు మళ్లీ మంచి రోజులు రావడం ఖాయమని, తమిళనాడును శాసించడం తథ్యమని చెప్పుకుని మురిసిపోతున్నారు.. కానీ నిజంగానే చిన్నమ్మకు శుభఘడియలు వచ్చాయా? ఒకవేళ పది కోట్ల రూపాయల జరిమానా చెల్లించారే అనుకుందాం! అప్పుడు ఆమెకు అదో చిక్కు సమస్య అయ్యే ప్రమాదం లేదా? ఆ పది కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఐటీ అధికారులు అడగరా? అడిగితే లెక్కలు చెప్పగలరా? ఇవన్నీ ప్రశ్నలే! ఈ ముగ్గురి శిక్షకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14తో ముగుస్తుంది.. నాలుగేళ్లుగా జైలులో ఉంటున్నారు.. అయితే సత్ప్రవర్తన కింద శశికళ కొంచెం ముందుగానే విడుదల కావచ్చని ఆమె న్యాయవాది ఇంతకు ముందు చాలాసార్లు అన్నారు.. బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త నరసింహన్‌ ఆర్‌టీఐ కింద ఈ విషయాన్ని కనుక్కోవాలనుకున్నారు.. ఆయన పెట్టిన దరఖాస్తుకు జైళ్ల శాఖ నుంచి ఇలాంటి జవాబే వచ్చింది.. వచ్చే ఏడాది జనవరి 27న శశికళ విడుదల అవుతారని తెలిపింది.. నిజానికి ఆమె జైల్లో ఉన్నారన్న మాటే కాని.. అక్కడ కూడా అన్ని సౌఖ్యాలు అనుభవించారని అంటుంటారు ఆమె వ్యతిరేకులు.. జైలు అధికారులను మభ్య పెట్టి బయటకు వచ్చి షాపింగ్‌లు గట్రాలు చేసినట్టు ఇంతకు ముందు బెంగళూరు జైళ్లశాఖ డీఐజీగా ఉన్న రూప ఆరోపించిన సంగతి తెలిసిందే! ఇదంతా ఓకేనే కాని.. పది కోట్ల రూపాయలదే పెద్ద సమస్య అయి కూర్చుంది.. జరిమానా చెల్లింపుల కోసం శశికళ అనుచరులు బెంగుళూరులోనే మకాం వేశారు.. ఉత్తినే జరిమానా కట్టేస్తామంటే కుదరని పని.. అంత పెద్ద మొత్తం జరిమానా చెల్లిస్తున్నప్పుడు ఐటీ శాఖ అనుమతి తీసుకోవాలి.. ఇదంత ఈజీ వ్యవహారం కాదు.. నిజంగానే శశికళ బయటకు వస్తే తమిళనాడు రాజకీయాలు మారతాయా? అన్నా డీఎంకే చీలిపోతుందా? అసలు శశికళ ఓటర్లను ఏ మేరకు ప్రభావం చూపగలరు? జయలలిత ఛరిష్మాతో శశికళ ఛరిష్మాను పోల్చడం సబబేనా? ఓ రెండు నెలలు గడిస్తే కానీ ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రావు.. అప్పటి వరకు ఎదురుచూద్దాం..!!