భారీ ఫైన్‌ల బాదుడు.. బైక్‌లను తోసుకెళ్తున్న రైడర్లు!

సెప్టెంబర్ 1 నుంచి కేంద్రం కొత్త మోటారు చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, మరో రెండు రాష్ట్రాలు తప్పితే.. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చారు. దీనితో వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ నిబంధనను ఉల్లంఘించినా.. భారీ జరిమానాలు తప్పవు. ఈ నేపథ్యంలో కొత్త ట్రాఫిక్ రూల్స్‌పై సోషల్ మీడియాలో మెమెస్, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఇక లేటెస్ట్‌గా ఐపీఎస్ ఆఫీసర్ ఒకరు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ […]

భారీ ఫైన్‌ల బాదుడు.. బైక్‌లను తోసుకెళ్తున్న రైడర్లు!
Follow us

|

Updated on: Sep 05, 2019 | 12:55 AM

సెప్టెంబర్ 1 నుంచి కేంద్రం కొత్త మోటారు చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, మరో రెండు రాష్ట్రాలు తప్పితే.. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చారు. దీనితో వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ నిబంధనను ఉల్లంఘించినా.. భారీ జరిమానాలు తప్పవు. ఈ నేపథ్యంలో కొత్త ట్రాఫిక్ రూల్స్‌పై సోషల్ మీడియాలో మెమెస్, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఇక లేటెస్ట్‌గా ఐపీఎస్ ఆఫీసర్ ఒకరు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొత్తగా అమలులోకి వచ్చిన రూల్ ప్రకారం హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే రూ.1000 జరిమానా విధిస్తారు. ఇక హెల్మెట్ లేకుండా బండి నడిపి.. పోలీసులకు దొరికితే భారీ జరిమానా కట్టాల్సి వస్తుంది. అయితే అదే పోలీసులు ఉన్నప్పుడు హెల్మెట్ లేకుండా బండిని తోసుకుంటూ వెళ్తే ఫైన్ పడుతుందా..డ్రైవింగ్ చేయలేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళినట్లే కదా.. ఇక ఈ ఐడియాను రికార్డు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని పంకజ్ నయిన్ అనే ఓ ఐపీఎస్ అధికారి విపరీతమైన నవ్వు తెప్పిస్తోందంటూ ట్వీట్ చేశాడు. ఆ వీడియోను నెటిజన్ల విపరీతంగా రీ-ట్వీట్ చేస్తున్నారు.

అటు ట్విట్టర్‌లో వీటిపై మరికొన్ని కామెడీ మెమెస్ హల్చల్ చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.