మోదీ ఫస్ట్ డీల్.. 100 బాలాకోట్ బాంబులు

రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. దేశ ఆయుధ సంపత్తిని పటిష్టం చేసే పనిలో పడ్డారు. ఇటీవల బాలాకోట్‌ ఎయిర్ స్ట్రైక్‌లో ఉపయోగించిన బాంబులను కొనేందుకు ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్కడి నుంచి వంద స్పైస్-2000 బాంబులను కొనుగోలు చేసేందుకు భారత వైమానిక దళం గురువారం రూ.300కోట్లతో డీల్ చేసింది. అధునాతనమైన ఈ బాంబులను పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరంపై దాడి చేయడానికి భారత్ ఉపయోగించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్స్డ్‌ డిఫెన్స్ […]

మోదీ ఫస్ట్ డీల్.. 100 బాలాకోట్ బాంబులు
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 1:59 PM

రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. దేశ ఆయుధ సంపత్తిని పటిష్టం చేసే పనిలో పడ్డారు. ఇటీవల బాలాకోట్‌ ఎయిర్ స్ట్రైక్‌లో ఉపయోగించిన బాంబులను కొనేందుకు ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్కడి నుంచి వంద స్పైస్-2000 బాంబులను కొనుగోలు చేసేందుకు భారత వైమానిక దళం గురువారం రూ.300కోట్లతో డీల్ చేసింది. అధునాతనమైన ఈ బాంబులను పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరంపై దాడి చేయడానికి భారత్ ఉపయోగించిన విషయం తెలిసిందే.

ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్ అడ్వాన్స్డ్‌ డిఫెన్స్ సిస్టమ్స్ సంస్థ ఈ ఆయుధాలను తయారుచేస్తోంది. మోదీ రెండో సారి కొలువు తీరాక కుదుర్చుకున్న మొదటి రక్షణ ఒప్పందం ఇదే కావడం విశేషం. కాగా, అత్యవసర కొనుగోలు కింద ఈ బాంబులను సమీకరించుకుంటున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. ఈ ఏడాది చివర్లోగా అవి మనకు చేరుతాయని తెలిపారు.

స్పైస్-2000 బాంబు విశేషాలు..

* ఇది 900 కిలోల ఉక్కు కవచంలో 80 కిలోల పేలుడు పదార్థాలను కలిగి ఉంటుంది

* లక్ష్యంగా నిర్దేశించిన భవనంలోకి చొచ్చుకెళ్తుంది

* భవనంలో పదునైన వస్తువులను వెదజల్లుతుంది

* ఫలితంగా ఆ భవనంలోని వారంతా అక్కడికక్కడే చనిపోతారు