Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

గులాబీ పార్టీకి కొత్త చిక్కులు.. కేసీఆర్ మదిలో ఏముందో?

new headache to kcr, గులాబీ పార్టీకి కొత్త చిక్కులు.. కేసీఆర్ మదిలో ఏముందో?

గులాబీ పార్టీ టిఆర్ఎస్‌ను పాత కొత్త చీడ వెంటాడుతోంది. అన్నదమ్ముల్లా కలిసుండాలని అధిష్టానం చెప్తుంటే. పాత పగల పాలోళ్ళ పంచాయితీ కొన్ని నియోజకవర్గాల్లో అధినాయకత్వానికి కొత్త సమస్యలు తెస్తోంది. కొత్త, పాత నీరు కలిసి పనిచేసేదెప్పుడు? సమిష్టిగా ముందుకెళ్ళేదెప్పుడని గులాబీ శ్రేణులు మధన పడుతున్న పరిస్థితి తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తోంది.

టీఆర్‌ఎస్‌లోకి ఈ మధ్య చాలా మంది నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిన చోట కాంగ్రెస్ నుండి గెలిచి, టిఆర్ఎస్‌లో చేరిన వాళ్లు ఆ నియోజకవర్గాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించడంతోనే అసలు సమస్య మొదలయిందని చెప్పుకుంటున్నారు.

పదవుల్లో లేక పాత వాళ్ళు పరేషాన్ అవుతుంటే.. కొత్త వాళ్ళు పాత నేతలను పట్టించుకోకపోవడం.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, పార్టీ కమిటీల్లో మాజీ ఎమ్మెల్యేలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో కొత్త వివాదాలు మొదలయ్యాయి.

నిత్యం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో నేతల మధ్య చిచ్చు ముదిరింది. తాజాగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వుందని టీఆర్ఎస్ నేతలే అంగీకరిస్తున్నారు.

ఈమధ్య జూపల్లి వర్గాన్ని చీల్చి తన బలాన్ని పెంచుకోవాలని హర్ష వర్ధన్ ప్రయత్నం చేసినట్లు చర్చ జరుగుతోంది. నియోజక వర్గంలో జూపల్లి, హర్షల మధ్య చిచ్చు రాజుకున్నట్లు కేడర్ చర్చించుకుంటుంది. హర్ష వర్ధన్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి వర్గంలో చేరడాన్ని జూపల్లి వర్గం జీర్ణించు కోలేకపోతున్నట్లు తెలుస్తోంది.

దీనికి తోడు కొల్లాపూర్ కోట వివాదంలో మాజీ మంత్రి బహిరంగంగా సభలు పెట్టి మరి ఆరోపణలు చేస్తున్నారు. ఈ కోట కథ వెనకాల ఎమ్మెల్యే వర్గీయుల ప్రమేయం ఉంది అన్నది జూపల్లి బ్యాచ్ వాదన.

ఇక పాలేరు నియోజక వర్గంలోనూ ఇదే పరిస్థితి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు యాక్టివ్‌గా మారి, నియోజకవర్గంలో తెగ పర్యటిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి, టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే కందాడి ఉపేందర్ రెడ్డి వర్గం జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఉపేందర్ వైపు వెళ్లకుండా తుమ్మల ఈ స్కెచ్ వేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. తుమ్మలపై ఉపేందర్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది.

ఉపేందర్ రెడ్డి వర్గీయులు అవసరం అయితే పార్టీ మారాలని ఒత్తిడి కూడా తెస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా ప్రతి నియోజక వర్గంలో పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ వుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.