శబరిమలై ప్రధాన పూజారి(మేల్‌సంతి)గా సుధీర్‌ నంబూద్రి

New head priest selected for Ayyappa temple at Sabarimala, శబరిమలై ప్రధాన పూజారి(మేల్‌సంతి)గా సుధీర్‌ నంబూద్రి

శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రధాన పూజారిని ఎంపిక చేశారు. అలానే మలికాప్పురం దేవీ ఆలయానికి కూడా ప్రధాన పూజారిని ఎంపిక చేశారు. అయ్యప్ప ఆలయానికి మలప్పురం జిల్లా తిరునవాయకు చెందిన ఏకే సుధీర్‌ నంబూద్రిని, మలికాప్పురం దేవీ ఆలయానికి ఆలువాకు చెందిన ఎంఎస్‌ పరమేశ్వరన్‌ను ఎంపిక చేశారు. వీరు నవంబర్‌ 17 నుంచి రాబోయే ఏడాది కాలానికి ఆలయాలకు ప్రధాన పూజారులుగా కొనసాగనున్నారు.

పందళ రాజవంశానికి చెందిన బాలుడు మాధవ్‌ కే వర్మ ఆలయ సోపానంలో డ్రా నిర్వహించిన డ్రా పద్దతిలో ప్రధాన పూజారులను ఎంపిక చేసినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వెల్లడించింది. కొత్తగా ఎంపికైన వారు నవంబర్‌ 16 సాయంత్రం నుంచి మొదలయ్యే 41 రోజుల మండల దీక్ష నుంచి ప్రధాన పూజారులుగా కొనసాగనున్నట్లు బోర్డు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *