రాష్ట్రంలో కరెంట్ మీటర్ రీడింగ్ షురూ

లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన కరెంట్ మీటర్ రీడింగ్, బిల్లుల జారీ మంగళవారం నుంచి మొదలైంది. లాక్ డౌన్ సడలింపుల కారణంగా తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సిబ్బంది ఇంటింటికి తిరిగి మీటర్ రీడింగ్ తీస్తున్నారు.

రాష్ట్రంలో కరెంట్ మీటర్ రీడింగ్ షురూ
Follow us

|

Updated on: Jun 03, 2020 | 3:54 PM

లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన కరెంట్ మీటర్ రీడింగ్, బిల్లుల జారీ మంగళవారం నుంచి మొదలైంది. కరోనా వ్యాపించకుండా సర్కారు తీసుకున్న చర్యల్లో భాగంగా ఏప్రిల్ నెల నుంచి మీటర్ రీడింగ్ తీయలేదు. విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి మేరకు గత ఏడాది ఏప్రిల్, మే నెలల బిల్లుల ప్రకారం, ఈ ఏడాది ఈ రెండు నెలలకు అంచనా బిల్లులు చెల్లించే అవకాశం కల్పించారు. లాక్ డౌన్ సడలింపుల కారణంగా తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సిబ్బంది ఇంటింటికి తిరిగి మీటర్ రీడింగ్ తీస్తున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి వాస్తవ బిల్లులను రీడింగ్ నమోదు చేస్తున్నారు. ఇప్పటికే మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన అంచనా బిల్లులు చెల్లించిన వారి వివరాలు, చెల్లించనివారి వివరాలన్నీ బిల్లింగ్ మీషన్ డేటా ఆధారంగా లెక్క కడుతున్నారు. మూడు నెలల పాటు వాడిన కరెంటు మొత్తం యూనిట్లను మూడు నెలలతో భాగించి ఒక్క నెలకు ఎంత చెల్లించాలో యావరేజ్ లెక్కించి అసలు బిల్లు ఇచ్చేటట్లు సాఫ్ట్ వేర్ ను రూపొందించారు విధ్యుత్ శాఖ అధికారులు. ఒకవేళ మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి జారీ చేసిన అంచనా బిల్లులు ప్రస్తుతం ఇచ్చే వాస్తవ బిల్లు కంటే అధికంగా ఉంటే మైనస్ బిల్లు ఇవ్వనున్నారు. మరోవైపు రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న కరెంట్ రీడింగ్ సిబ్బందికి రెండు నెలల మొత్తాన్ని ఒకేసారి ఇచ్చేందుకు అనుమతినిచ్చింది విద్యుత్ శాఖ. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1800 రీడర్లకు నెలకు రూ.3 వేల చొప్పున ఏప్రిల్, మే నెలలకు చెల్లించాలని విద్యుత్ సంస్థలు ఆదేశించాయి. ఈపీఎఫ్, ఈఎస్ఐ రిజిస్ట్రేషన్అయిన వారికి మాత్రమే ఈ రెండు నెలల జీతం లభించనుంది.

పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. "మై డియర్ దొంగ" ట్రైలర్ విడుదల..
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్..
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్