క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్..!

మందు లేని మహమ్మారి క్యాన్సర్ బాధితులకు ఒక శుభవార్త. వ్యాధి నివారణకు కొత్త మందును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అమెరికాకు చెందిన అంకాలజీ వైద్య నిపుణులు ప్రకటించారు. ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్‌ వ్యాధి చికిత్సలో కొత్త మందులు సంతృప్తికర ఫలితాలనిస్తున్నాయని ప్రపంచ క్యాన్సర్‌ వైద్య నిపుణులు వెల్లడించారు. ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, పెద్దపేగు క్యాన్సర్ల నివారణలో ఈ మందులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయంటున్నారు. వీటి వాడకం ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్ ప్రభావాలూ తక్కువగా ఉంటున్నాయన్నారు. దీన్ని పొందాలంటే […]

క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 30, 2020 | 5:19 PM

మందు లేని మహమ్మారి క్యాన్సర్ బాధితులకు ఒక శుభవార్త. వ్యాధి నివారణకు కొత్త మందును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అమెరికాకు చెందిన అంకాలజీ వైద్య నిపుణులు ప్రకటించారు. ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్‌ వ్యాధి చికిత్సలో కొత్త మందులు సంతృప్తికర ఫలితాలనిస్తున్నాయని ప్రపంచ క్యాన్సర్‌ వైద్య నిపుణులు వెల్లడించారు. ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌, పెద్దపేగు క్యాన్సర్ల నివారణలో ఈ మందులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయంటున్నారు. వీటి వాడకం ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్ ప్రభావాలూ తక్కువగా ఉంటున్నాయన్నారు. దీన్ని పొందాలంటే మాత్రం కాస్త ధర ఎక్కువగా వెచ్చించాల్సి ఉంటుందంటున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ అదుపునకు ఆస్ట్రా జెనికా కంపెనీ తయారు చేస్తున్న ‘టాగ్రిస్సో’ బాగా పనిచేస్తోందని.. ఆ ఔషధంపై ట్రయల్స్ జరుగుతున్నాయని యేల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ వైద్యులు డాక్టర్‌ రాయ్‌ హెర్బ్స్‌ తెలిపారు. ఈ మందు నెలరోజుల కోర్సుకు 15 వేల డాలర్లు ఖర్చవుతుందన్నారు. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కారణంగా తలెత్తే ఇతర సమస్యలను మ్యోవాంట్‌ సైన్సెస్‌ కంపెనీకి చెందిన ‘రెలుగోలిక్స్‌’ సమర్థంగా అదుపు చేస్తోందని సియాటిల్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ సెలెస్టియా హిగానో తెలిపారు. మెర్క్‌ అండ్‌ కంపెనీ వారి ‘కీట్రుడా’ పెద్దపేగు క్యాన్సర్‌ను అదుపు చేస్తున్నట్లు నాష్‌విల్లే క్యాన్సర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధిపతి డాక్టర్‌ హోవర్డ్‌ బరిస్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఈయన యూఎస్‌లోని అంకాలజీ సొసైటీ అధ్యక్షుడిగానూ సేవలందిస్తున్నారు. అయితే, ఇంతకాలం సరియైన మందులేక ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అమెరికా వైద్యులు చేస్తున్న కొత్త ప్రయోగం వల్ల క్యాన్సర్ బాధితులకు కొంత ఊరట లభించనట్లవుతుంది.

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?