Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

ఇక డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత సులువు కాదు..!

New Driving License Registration Norms Coming Soon, ఇక డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత సులువు కాదు..!

డ్రైవింగ్ లైసెన్స్.. వాహనాలను నడిపే సామర్థ్యం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి ఇచ్చే అనుమతి పత్రం. అయితే ఇప్పటి వరకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ పోందడం కాస్త సులువుగానే ఉండేది. దానికి కారణం.. ఇంటి దగ్గర, డ్రైవింగ్ స్కూల్స్‌లో కాస్త ట్రైన్ అయ్యి.. టెస్ట్‌లో పాల్గొని ఉత్తీర్ణులు అయ్యేవారు. అయితే ఈ సమయంలో కొందరు అటు ఇటూ వణికినా.. మరో అవకాశం ఇచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకుని ఎదోలా పాస్ అయ్యి.. డ్రైవింగ్ లైసెన్స్ పొందేవారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు.

ఇటీవల కేంద్రం రోడ్డు రవాణా ప్రమాదాలపై సీరియస్‌గా చర్యలు చేపట్టింది. రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా మోటార్ వెహికిల్ చట్టానికి పదును పెట్టింది. అంతేకాదు.. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలను విధించేలా చట్టాన్ని సవరించింది. అయితే ఇప్పుడు వాహనదారులకు ఇచ్చే లైసెన్స్‌లపై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపక్రమించింది. డ్రైవింగ్ అర్హత లేకుండా రోడ్లపైకి వాహనాలు తీసుకువచ్చే సరికి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో గాయపడే వారు కొందరైతే, ప్రాణాలు కోల్పోతున్న వారు మరికొందరు. అయితే ఇదంతా నిర్లక్ష్యపు డ్రైవింగ్ అనుకోవాలా, లేక వాహనాలను నడిపే సామర్థ్యం లేకపోవటయా అన్న దానిపై కేంద్ర ఆలోచనలు మొదలు పెట్టంది. ఇక వాహనలు నడిపే వారి భద్రత దృష్ట్యా ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా, పోలీసు, రవాణా శాఖలు ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత కఠినం చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది.

ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ అప్లే చేసుకున్న సదరు వ్యక్తి కచ్చితంగా వాహనాన్ని నడిపే సామర్థ్యం ఉన్నట్టు రుజువైతేనే లైసెన్స్ జారీ చేస్తామని తెలిపింది. డ్రైవింగ్ లైసెన్సుల కోసం వస్తున్న చాలామంది డ్రైవింగ్ చేయడంలో తడబడుతున్నట్లు గుర్తించారు. వాహనం నడుపుతున్నప్పడు కాస్త వణకడం ధృడ విశ్వాసం లేకుండానే డ్రైవ్ చేయడంతో.. ఇతర వాహనదారులు ఇబ్బందులకు గురై.. ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతంలో లైసెన్సుల జారీ ఎలా జరిగినా.. ఇకపై పకడ్బందీగా జారీ చేయాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇక ఇప్పటినుండి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడమంటే అంత సులువేం కాదు. వాహనం నడపడంలో కాస్త తడబడి అటు ఇటైతే టెస్ట్‌ ఫెయిలయ్యే చాన్స్‌ ఉంది. ఇక వాహనదారుడి ప్రతి కదలికను పసిగట్టే హైటెక్నాలజీ వున్న సెన్సర్లతో లైసెన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. త్వరలోనే ఈ విధానం అన్ని ఆర్టీవో ఆఫీసుల్లోకి రాబోతోంది.

ఈ సెన్సర్‌ కలిగిన సీసీ కెమెరాలు, డ్రైవింగ్‌ ట్రాక్‌పై 25 నుంచి 30 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తారు. అప్పుడు డ్రైవర్‌ ట్రాక్‌పైకి వచ్చినప్పటి నుంచి బయటకెళ్లే వరకు అన్ని కదలికలను ఈ కెమెరాలు నిక్షిప్తంచేస్తాయి.టెస్ట్ టైంలో డ్రైవర్ వెహికిల్ ఎలా డ్రైవ్ చేశాడు.. ఎన్ని సార్లు బండి ఆగింది.. డ్రైవింగ్‌లో ఏమైనా లోపాలున్నాయా? అన్న అంశాలను ఈ సీసీ కెమెరాలతో గుర్తిస్తారు. అంతేకాదు.. మార్కులను కూడా బండి నడిపే విధానం ఆధారంగా వేస్తారు. అది కూడా ఈ సీసీ కెమెరా ఆధారంగానే.. సో ఇక డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే.. కష్టపడాల్సిందే.