పొట్టిబట్టలు ధరిస్తే ఫైన్.!

ఇక మీదట పొట్టి దుస్తులు వేసుకునే మహిళలకు జరిమానాలు విధించేలా కంబోడియా ప్రభుత్వం రూపొందిస్తున్న చట్టం వివాదాస్పదంగా మారుతోంది. దీనికి సంబంధించి ముసాయిదా సిద్ధం చేశారని తెలిసి యువతులు

పొట్టిబట్టలు ధరిస్తే ఫైన్.!
Follow us

|

Updated on: Sep 17, 2020 | 9:52 PM

ఇక మీదట పొట్టి దుస్తులు వేసుకునే మహిళలకు జరిమానాలు విధించేలా కంబోడియా ప్రభుత్వం రూపొందిస్తున్న చట్టం వివాదాస్పదంగా మారుతోంది. దీనికి సంబంధించి ముసాయిదా సిద్ధం చేశారని తెలిసి యువతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం ఆమోదం పొందితే, కంబోడియాలో శరీరం ఎక్కువగా కనిపించేలా మహిళలు ‘పొట్టి’ బట్టలు వేసుకోవడంపై నిషేధం అమలవుతుంది. అటు, పురుషులు కూడా అర్ధనగ్నంగా ఛాతీపై దుస్తులు లేకుండా తిరగకూడదు. ప్రభుత్వ తీరుపై ఆడాళ్లు ఆన్‌లైన్‌లో పిటిషన్ మొదలుపెట్టారు. సౌకర్యంగా అనిపించే దుస్తులను వేసుకుంటే ప్రభుత్వంకు వచ్చిన ఇబ్బందేమిటని యువతులు ప్రశ్నిస్తున్నారు. దేశంలోని కొందరు మహిళలు, యువతులు స్కర్టులు, షార్టులు, స్విమ్‌వేర్ ధరించి ఉన్నప్పటి ఫొటోలను, చట్టంపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ చట్టం పేదలను మరింత అణగదొక్కి, సమాజంలో అసమానతలను మరింత పెంచే ప్రమాదం ఉందని కూడా కొందరు మహిళలు అభిప్రాయపడుతున్నారు.