Breaking News
  • ప్రజలు ఘోరంగా తిరస్కరించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు. కష్టకాలంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు-అంబటి. రాష్ట్ర ఖజానా నుంచే రూ.1000 ఇచ్చాం. దీనిపై కూడా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు-అంబటి. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి.. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు-వైసీపీ నేత అంబటి.
  • పశ్చిమ బెంగాల్‌లో మందుబాబులకు గుడ్‌ న్యూస్‌. పశ్చిమ బెంగాల్‌లో మ.2 గంటల నుంచి సా.5 గంటల వరకు.. మద్యం పంపిణీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం. ఉ.11 నుంచి మ.2 గంటల వరకు బార్ల నుంచి అర్డర్లు. మ.2 గంటల నుంచి పోలీసుల ద్వారా పంపిణీకి అనుమతి.
  • ప్రకాశం: ఒంగోలులో మరో మూడు పాజిటివ్‌ కేసులు. ప్రకాశం జిల్లాలో 27కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు.
  • తూ.గో: సామర్లకోటలో మట్టి తవ్వకాలను అడ్డుకున్న చినరాజప్ప. మట్టి మాఫియా చెలరేగిపోతోంది-ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. మట్టి అక్రమ తవ్వకాలపై కలెక్టర్‌తో మాట్లాడా. పెద్దపులి చెరువులో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని.. అక్రమ తవ్వకాలపై విచారణ జరిపిస్తామని కలెక్టర్‌ తెలిపారు-చినరాజప్ప.
  • తమిళనాడులో వేగంగా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి. ఈ రోజు తమిళనాడులో 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఇప్పటి వరకు తమిళనాడులో 738 కరోనా కేసులు నమోదు.

విశాఖవైపు మరో అడుగు.. జగన్ తాజా నిర్ణయం

new dpr for vizag metro, విశాఖవైపు మరో అడుగు.. జగన్ తాజా నిర్ణయం

విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసే దిశగా జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మెట్రోరైలు ప్రాజక్టు పరిధి పెంచాలన్న కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తీసుకున్నారు. గతంలో సిద్దమైన మెట్రో రైలు డీపీఆర్‌లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డీపీఆర్ రెడీ అయిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్‌ రూపొందించాలని సీఎం ఆదేశించారు. తాజాగా మరోసారి డీపీఆర్ రూపొందించేందుకు ప్రతిపాదనలను పిలవాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొటేషన్లు పిలిచేందుకు అమరావతి మెట్రో రైలు ఎండీకి ఆదేశాలు ఇచ్చారు.

గతంలో సుమారు 38 కి.మీల మేరకు మాత్రమే విశాఖలో మెట్రో నిర్మించాలని అప్పటి ప్రభుత్వం తలపెట్టగా జగన్ ప్రభుత్వం దాన్ని 80 కి.మీ.లకు పెంచాలని తలపెట్టింది. దానికి తోడు గతంలో చంద్రబాబు ప్రభుత్వం డీపీఆర్ రూపకల్పన కోసం ఎస్సెల్ ఇన్‌ఫ్రా కన్సార్షియంకు బాధ్యతలప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా రద్దు చేశారు. కొత్త డీపీఆర్ రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్, రైట్స్, యూఎంటీసీ లాంటి సంస్థలను సంప్రదించాలని ప్రభుత్వం భావిస్తుంది. విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టును హైదరాబాద్ తరహాలోనే మూడు కారిడార్లుగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రైలుతోపాటు.. 60 కి.మీ. మేరకు మోడ్రన్ ట్రామ్ కారిడార్‌ను కూడా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Tags