కొత్త జిల్లాల ఏర్పాటుకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్..!

New districts in Andhra Pradesh: Jagan may give clarity before January 26, కొత్త జిల్లాల ఏర్పాటుకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్..!

తాము అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హామీ దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇటీవల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన సమయంలో ఆయనతో జగన్ చర్చించినట్లు సమాచారం. ఏపీలో సమగ్ర భూ సర్వే చేపట్టే యోచనలో ఉన్న ప్రభుత్వం.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను కూడా మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనే ఆలోచనలో ఉన్న జగన్.. వీటికి అదనంగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా ఆరా తీస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

అయితే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ దృష్టి సారించారు. అయితే ఆ తరువాత ఈ ప్రతిపాదనను పక్కనపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని భావించిన సీఎం జగన్.. అప్పట్లో ఈ ప్రతిపాదనను పక్కకు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా కసరత్తు మొదలుపెట్టినట్లే కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *