ఫ్రీగా కరెంట్ అమ్మండి.. లక్షలు సంపాదించండి!

దాదాపు పదేళ్ల కిందట ఉమ్మడి ఏపీలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతంగా ఉండేవి. పల్లెల్లో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు.. అదే పట్టణాల్లో అయితే 8 గంటల కోత ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు 24 గంటలూ గృహాలకు, వ్యవసాయానికి కరెంట్ సరఫరా అవుతోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.? కరెంట్ ప్రతి నెలా వాడుతూ వేల బిల్లులు కట్టడమే కాకుండా.. అదే కరెంట్‌ను ఆదాయమార్గంగా మలిచి లక్షలు వెనకేసుకుంటున్నారు […]

ఫ్రీగా కరెంట్ అమ్మండి.. లక్షలు సంపాదించండి!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 30, 2019 | 3:36 PM

దాదాపు పదేళ్ల కిందట ఉమ్మడి ఏపీలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతంగా ఉండేవి. పల్లెల్లో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు.. అదే పట్టణాల్లో అయితే 8 గంటల కోత ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు 24 గంటలూ గృహాలకు, వ్యవసాయానికి కరెంట్ సరఫరా అవుతోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.? కరెంట్ ప్రతి నెలా వాడుతూ వేల బిల్లులు కట్టడమే కాకుండా.. అదే కరెంట్‌ను ఆదాయమార్గంగా మలిచి లక్షలు వెనకేసుకుంటున్నారు కొంతమంది వినియోగదారులు. ఒక్క కృష్ణా జిల్లాలోనే ప్రతి ఏటా 43 లక్షలు సంపాదిస్తున్నారట.

‘సూర్యశక్తి’ పథకం కింద సోలార్ రూఫ్ టాప్‌ను ఇళ్లపై భాగంలో అమర్చుకుని.. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎవరైతే ఈ పథకం కింద సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటారో వారికి రాయితీ కూడా ఇస్తోంది. ఇందులో భాగంగా కృష్ణాజిల్లాలోని 643 మంది వినియోగదారులు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికే 444 మంది వారి గృహాలకు ఈ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నారు. వీరు వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను ఏపీఎన్పీడీసీఎల్ కొనుగోలు చేస్తోంది. యూనిట్‌కు రూ.5.58 చొప్పున గ్రిడ్‌కు ఈ వినియోగదారులు అమ్ముకుంటారు.

కేవలం రూ.60 వేలు ఖర్చయ్యే ఈ పథకానికి రూ.50 వేలు రాయితీ ప్రభుత్వం కలిపిస్తోంది. దీంతో పదివేలకే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఏటా విద్యుత్ అమ్మకం ద్వారా లక్షలు సంపాదించవచ్చు. ఇప్పటికే కృష్ణాజిల్లా వ్యాప్తంగా వినియోగదారులు ఏకంగా రూ.43 లక్షలు ఆర్జిస్తుండటం  విశేషం. మరోవైపు సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీఎన్పీడీసీఎల్ అధికారులు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు కూడా.