కేరళలో కరోనా కరళనృత్యం

కేరళలో కరోనా మహమ్మారి కరళనృత్యం చేస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో  రాష్ట్రంలో 2,333 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 50,231కు చేరింది. కేవలం ఈ ఒక్క రోజే ...

కేరళలో కరోనా కరళనృత్యం
Follow us

|

Updated on: Aug 19, 2020 | 9:52 PM

కేరళలో కరోనా మహమ్మారి కరళనృత్యం చేస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో  రాష్ట్రంలో 2,333 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 50,231కు చేరింది. కేవలం ఈ ఒక్క రోజే  7గురు బాధితులు కరోనాతో  మరణించగా ఇప్పటివరకు 182 మంది మృత్యువాత పడ్డారని ఆరోగ్య మంత్రి కెకె శైలజ వెల్లడించారు. వివిధ ఆస్పత్రుల్లో 17,382 మంది ప్రస్తుతం వ్యాధి సోకి చికిత్స పొందుతుండగా.. బుధవారం 1,217 మంది వ్యాధి నుంచి కోలుకొన్నారు. మొత్తం 32,611 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు  పేర్కొన్నారు.

అత్యధికంగా తిరువనంతపురంలో 540 కేసులు నమోదు కాగా.. మలప్పురంలో 322, అలప్పుజ 253, ఎర్నాకుళం 230, కొట్టాయం 203 కేసులు నమోదయ్యాయని శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం గడిచిన 24 గంటల్లో 36,291 నమూనాలను పరీక్షించగా ఇప్పటివరకు 12,76,358 మందికి కరోనా పరీక్షలు చేశారు.