Breaking News
  • హైద్రాబాద్ పోలీసులను ఆశ్రయించిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. తనఫై సోషల్ మీడియా లో అసత్య ఆరోపణలు చేస్తునారని ఫిర్యాదు . ప్రముఖ హోటల్ నుంచి హీరోయున్ తో బయటకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ . కొంతమంది ప్రత్యర్థి వ్యక్తులు తన ఫై ఫెస్ బుక్ , ట్విట్టర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు . ఈ ఆరోపణలతో ప్రజల్లో తనపై లేని అనుమానాలు వ్యక్తం అవుతాయాని ఫిర్యాదు లో పేర్కొన్న బోండా ఉమా . ఆ హీరోయిన్ ఎవరో తనకు తెలియదు , సంబంధం లేదు అంటున్న బోండా ఉమా.
  • గుంటూరు:ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం పేరుతో మోసం. ఆన్ లైన్ ప్రకటన చూసి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన సత్తెనపల్లికి చెందిన మహేశ్వరి. లక్షా 90 వేలు వసూలు చేసిన సైబర్ నేరగాల్లు. మోసం గ్రహించి సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదులు చేసిన బాధితురాలు.
  • తెలంగాణా , ఏ పి లో తెరుచుకొని సినిమా థియేటర్స్. ఆన్ లాక్ 5.o లో భాగంగా ఈ నెల 15నుంచి సినిమా హాళ్ళకు 50శాతం అక్యుపెన్సి తో అనుమతి ఇచ్చిన కేంద్రం. తెలంగాణాలో సినిమా థియేటర్స్ కు అనుమతి ఇవ్వని తెలంగాణా ప్రభుత్వం. సినిమా థియేటర్స్ తెరిచేందుకు సుముఖంగా వున్న తెలంగాణా థియేటర్స్ ఓనర్స్. ఏపీ లో సినిమా హాళ్లు తెరిచేందుకు జగన్ సర్కారు అనుమతి. కానీ థియేటర్స్ తెరిచేందుకు సుముఖంగా లేని సినిమా హాళ్లు ఓనర్స్. ఏపీ ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకుంటే సినిమా హాళ్లు తెరుస్తామంటున్న థియేటర్స్ ఓనర్స్. తెలంగాణాలో సినిమా హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అంటున్న థియేటర్స్ ఓనర్స్. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే తెరుచుకో నున్న సినిమా హాళ్లు.
  • చెన్నై : తమిళనాడు ఏసీబీ చరిత్రలోనే అత్యంత అవినీతి అధికారిని గుర్తించిన ఏసీబీ. వెల్లూర్ జిల్లా లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారికి ఐదువందల కోట్ల అక్రమ ఆస్తులు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగి పన్నీర్ సెల్వం ఇంట్లోనే ఉద్యోగి దొరికిన మూడున్నర కోట్ల డబ్బు. నాలుగు ట్రంక్ పెట్టెలో డబ్బు తరలింపు. 4 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం. తమిళనాడులో90 చోట్ల కొనుగోలు చేసిన విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. పన్నీరుసెల్వం ని అదుపులోకి తీసుకోని విచారిస్తున్న విజిలెన్సు అధికారులు . వెల్లూర్ జిల్లా లో ప్రభుత్వ ఇంజనీర్ గా ఉన్న పన్నీరుసెల్వం .తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం తో రంగం లోకి దిగిన విజిలెన్సు అధికారులు .
  • నటుడు సచిన్‌ జోషి అరెస్ట్: గుట్కా అక్రమ రవాణా చేస్తున్న వ్యవహారం ముంబయిలో హైదరాబాద్‌ పోలీసులు ఆరెస్ట్ . హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పట్టుకున్న పోలీసులు. భారీగా గుట్కా బాక్సులు దొరకడంతో ఓనర్ల ఫై నిఘా. సచిన్‌ జోషి పేరు బయటకు రావడంతో అరెస్ట్ చేసిన పోలీసులు . సచిన్‌పై ఐపీసీ 273, 336 సెక్షన్ల ప్రకారం నిషేధిత మత్తు పదార్థాల కేసు. అమ్మకాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారారనే ఆరోపణలుపై కేసు నమోదు . భారీ సంఖ్యలో గుట్కా బాక్సులు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తింపు.
  • బ్రేకింగ్: జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్. తన పర్యటన సందర్భంగా జిహెచ్ఎంసి అధికారులు ఎవరు రాకపోవడం తో ఆగ్రహం. కేంద్ర మంత్రి లోతట్టు ప్రాంతాల సందర్శన సందర్భంగా జిహెచ్ఎంసి అధికారులు దూరం. జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు పోన్ చేసి నిరసన. కనీసం డీఈ , ఎఈ స్థాయి అధికారులను పంపించక పోవడం సమంజసం కాదన్న కిషన్ రెడ్డి.

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. పాలిటెక్నిక్‌లో కొత్తగా 5 కోర్సులు..

ఏపీ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా ఐదు డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టేందుకు...

New courses sanctioned for private polytechnics , ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. పాలిటెక్నిక్‌లో కొత్తగా 5 కోర్సులు..

ఏపీ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా ఐదు డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతించింది. వెబ్ డిజైనింగ్, 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్-మల్టీమీడియా టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, సీఎస్సీ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డిప్లొమా కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకొస్తూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది, శిక్షణా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. (New courses sanctioned for private polytechnics)

గుంటూరు జిల్లా చెబ్రోలు మండలంలోని సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్- మల్టీమీడియా టెక్నాలజీ, వెబ్ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టడానికి అనుమతించింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం కిమ్స్ కాలేజీలో ప్యాకేజింగ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వగా.. కోరంగిలోని కిమ్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్‌లో 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్ డిప్లొమా కోర్సును అనుమతించింది.

అటు రాజానగరంలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ విమెన్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో డిప్లొమా కోర్సును మంజూరు చేసింది. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందే అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల వ్యవధి మూడేళ్గుగా నిర్ణయించారు. కాగా, SBTET నిబంధనల ప్రకారం పాలీసెట్ ద్వారా ప్రవేశాలను నిర్వహించనున్నారు.

Also Read:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే.!

ఆ పాత రూపాయి నాణెంతో.. రూ. 25 లక్షలు మీ సొంతమవుతాయట!

బిగ్ బాస్ 4: ‘టాప్’ లేపుతున్న ఆ ఇద్దరు.. ఫైనల్ ఫైవ్‌లో ఎవరుంటారో.?

Related Tags