కరోనా వైరస్‌కి​ పాములే కారణం..!

ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. చైనా నుంచి ఇతర దేశాలకు కూడా విస్తరిస్తోంది. ఈ వైరస్‌కు కారకం ఏంటన్న దానిపై పురోగతిని సాధించారు శాస్త్రవేత్తలు. నోవల్ కరోనా వైరస్ చైనాలోని తాచు పాముల కారణంగా వ్యాపించినట్టు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. దీనికి విరుగుడు కనుగునేందుకు విసృత పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రాణాంతక శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్థులు చైనాలో పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు కాస్త పురోగతి సాధించారు. ఈ వ్యాధికి కారణమైన నోవల్ కరోనా వైరస్ […]

కరోనా వైరస్‌కి​ పాములే కారణం..!
Follow us

|

Updated on: Jan 27, 2020 | 11:14 PM

ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. చైనా నుంచి ఇతర దేశాలకు కూడా విస్తరిస్తోంది. ఈ వైరస్‌కు కారకం ఏంటన్న దానిపై పురోగతిని సాధించారు శాస్త్రవేత్తలు. నోవల్ కరోనా వైరస్ చైనాలోని తాచు పాముల కారణంగా వ్యాపించినట్టు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. దీనికి విరుగుడు కనుగునేందుకు విసృత పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రాణాంతక శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్థులు చైనాలో పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు కాస్త పురోగతి సాధించారు. ఈ వ్యాధికి కారణమైన నోవల్ కరోనా వైరస్ చైనాలోని తాచు పాముల వల్ల వ్యాపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
మెడికల్ వైరాలజీ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనంలో ఈ వ్యాధి వ్యాప్తి పట్ల కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. చైనాలోని హువనన్ హోల్‌సేల్ మార్కెట్‌లో చాలారకాల సముద్ర జీవుల ఆహార పదార్థాలను అమ్మతారు. వాటిలో రకరకాల పాము జాతులు కూడా ఉన్నాయి. ఆ పాములే ఈ వ్యాధికి కారణమనే వాదన బలంగా ఉంది.  రిలెటివ్ సినానిమస్ కోడోన్ యూసేజ్ అనే ఫార్ములా ఉపయోగించి దీనిపై ఓ నిర్దారణకు వచ్చారు డాక్టర్లు. బ్యాట్ కరోనాతో పాటు మరో గుర్తు తెలయని వైరస్‌ల మిశ్రమమే దీనికి కారణమంటున్నారు. ఈ వైరస్ ఫామ్ కావడానికి పాములే ప్రధాన కారణమని వారు విశ్లేషిస్తున్నారు. మనుషులకు సోకడానికి ముందే ఈ వైరస్ పాముల్లో కనిపించిదని చైనాలోని పెకింగ్​ యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ సెంటర్​ స్టడీలో కూడా పేర్కొన్నారు.