Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 28,637 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • అమరావతి మండలం ముత్తాయపాలెం బ్యాంక్ ని మోసం చేసిన కేసులో ఉన్నతాధికారులు సీరియస్. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఏవిధంగా ప్రభుత్వానికి విక్రయించారంటూ ఆరా తీస్తున్న అధికారులు. ఇప్పటికే ప్రారంభమయిన పోలీసు దర్యాప్తు.
  • విజయవాడ: ఆత్రేయపురం ప్రేమకథ సినిమా పేరుతో మోసం. చైతన్య క్రియేషన్ బ్యానర్ పై సినిమా అంటూ యువతులకు వల. అమరావతి శివక్షేత్రంలో సినిమా ప్రారంభం అంటూ రిబ్బన్ కటింగ్ చేసిన గుంటూరు జిల్లాకు చెందిన రెంవత్ బిక్షా . విజయవాడ, గుంటూరు జిల్లాకు చెందిన యువతులను హీరోయిన్లుగా చేస్తానంటూ చీటింగ్.
  • తిరుపతి.... డయిల్ యువర్ ఈఓ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.... శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకుంటాం. నిధులు దుర్వినియోగం కానీయం. నెలరోజుల్లో 16.73 కోట్లు శ్రీవారికి హుండీ ద్వారా ఆదాయం లభించింది.
  • ఆత్రేయపురం ప్రేమకథ దర్శకుడు దేవరాయ రమేష్ అలియాస్ రవితేజ అలియాస్ రావణ్ బిక్షూ. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలి. ఆధారాలు టివి9 కే అందించాలి. ఎటువంటి కేసులు ఎదుర్కోవటానికైనా సిద్దంగా ఉన్నా. నా దగ్గర స్ర్కిప్టు తీసుకెళ్ళిన కో డైరెక్టర్ భార్గవి నాపైనే ఆరోపణలు చేస్తోంది. హీరో, ఇతర ఆర్టిస్ట్ లతో ఫోన్ లో మాట్లాడిన రావణ్ భిక్షూ.
  • హైదరాబాద్ లో మాయమైన సండే సందడి. చాలా ఏరియా లలో కనిపిస్తున్న కర్ఫ్యూ వాతావరణం . షాపులు...మాల్స్ ..రెస్టారెంట్లు..తెరిచి ఉన్నా కన్పిపించని పబ్లిక్. ఆదివారం మార్కెట్ లలో సైతం అనంతం మాత్రం గానే కొనుగోలుదారు. కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న కరోనా భయం. ఇళ్లకే పరిమితం అవుతున్న జనం. హైదరాబాద్ లో పెరుగుతున్న అధిక కేసులతో ... అలర్ట్ అయిన పబ్లిక్.
  • నగరంలో మరొకసారి ఆక్సిజన్ సిలిండర్ల పట్టివేత. ముషీరాబాద్ లో 34 సిలెండర్లని ఆక్సిజన్ సిలిండర్ ను సీజ్ చేసిన అధికారులు. అనుమతులు లేకుండా సిలిండర్ విక్రయిస్తున్న బాబా ట్రేడర్స్. అధిక ధరకు సిలిండర్లను అమ్ముతున్న సర్దార్ ఖాన్ ను అరెస్టు చేసిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు.

గుడ్ న్యూస్: కరోనాకి మందు దొరకినట్లేనా..?

రష్యా ముందడుగు వేసింది. ఆ దేశంలోని సైంటిస్టులు కరోనా డ్రగ్‌ను తయారు చేశారు. ఇందుకు గాను వారు ఇన్‌ఫ్లుయెంజా చికిత్సకు వాడే ఓ పాత ఔషధానికి మార్పులు చేసి.. కొత్తగా ఔషధాన్ని రూపొందించారు. ఈ డ్రగ్ తో కోవిడ్‌ 19 రోగులకు చికిత్స .
new coronavirus Favipiravir has produced promising results in early clinical trials in Russia, గుడ్ న్యూస్: కరోనాకి మందు దొరకినట్లేనా..?

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ తయారీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంపవ్యాప్తంగా వైద్య నిపుణులు, శాస్ర్తవేత్తలు చేస్తున్న పరిశోధనలు కొలిక్కి వస్తున్నాయి. ఇందులో రష్యా ముందడుగు వేసింది. ఆ దేశంలోని సైంటిస్టులు కరోనా డ్రగ్‌ను తయారు చేశారు. ఇందుకు గాను వారు ఇన్‌ఫ్లుయెంజా చికిత్సకు వాడే ఓ పాత ఔషధానికి మార్పులు చేసి.. కొత్తగా ఔషధాన్ని రూపొందించారు. ఇక ఆ డ్రగ్‌ కరోనాను నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని అక్కడి శాస్ర్తవేత్తలు వెల్లడించారు.
Favipiravir అనబడే ఓ యాంటీ వైరల్‌ డ్రగ్‌ను 2014లో జపాన్‌లో అప్రూవ్‌ చేశారు. అప్పటి నుంచి ఆ మెడిసిన్‌ను ఇన్‌ఫ్లూయెంజా చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు అదే డ్రగ్‌ను ఉపయోగించి రష్యా సైంటిస్టులు Avifavir పేరుతో మరో డ్రగ్‌ను తయారు చేశారు. ఈ డ్రగ్‌ కరోనాను పూర్తిగా నిరోధిస్తుందని సైంటిస్టులు చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. దీంతో ఈ డ్రగ్‌ వాడకానికి రష్యా ప్రభుత్వం తాత్కాలికంగా అనుమతి కూడా ఇచ్చేసింది. దీన్ని తయారు చేసిన ఫార్మా కంపెనీ పేటెంట్‌ కూడా పొందింది. ఇక మెడిసిన్‌కు సంబంధించి ఈ నెలలో 60వేల యూనిట్లు సిద్ధం చేసింది సదరు ఫార్మా కంపెనీ. ఈ డ్రగ్ ను కోవిడ్‌ 19 రోగులకు చికిత్స అందించేందుకు ఉపయోగిస్తున్నారు.
అయితే Favipiravir డ్రగ్‌పై ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ కంపెనీ కూడా మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టింది. జూలై లేదా ఆగస్టు వరకు ఆ ఫలితాలు వస్తాయని కంపెనీ ప్రతినిధుల భావిస్తున్నారు. అయితే రష్యాలో ఇప్పటికే ఆ డ్రగ్‌ సమర్థవంతంగా పనిచేస్తునందున.. భారత్‌లోనూ అలాంటి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నారు. అదే జరిగితే.. ప్రపంచ దేశాలన్నింటిలోనూ రష్యా తరువాత కోవిడ్‌ 19 డ్రగ్‌ను తయారు చేసిన దేశంగా భారత్‌ నిలుస్తుంది. ఆ డ్రగ్‌ కొత్తదేమీ కాదు కనుక.. దానిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ఏర్పడే అవరోధాలు అన్నీ తొలగిపోయాయంటున్నారు వైద్య నిపుణులు. దీంతో ఒకేసారి ఫేజ్‌-3 ట్రయల్స్‌ కూడా చేపట్టారు. ఇప్పటికే పేషెంట్లకు ఇచ్చి పరీక్షిస్తున్నారు. ఇక
ఫలితాలు వస్తే.. మన దేశంలోనూ కోవిడ్‌ 19 మెడిసిన్‌ను తయారికి మార్గం సుగమం అవుతుంది. అన్నీ ఓకే అయితే.. ఆగస్టు కల్లా భారత్‌లో కోవిడ్‌ 19కు మెడిసిన్‌ వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు.

Related Tags