బిగ్ బాస్: శ్రీముఖికి నిజంగానే అన్యాయం జరిగిందా.?

తెలుగు బిగ్ బాస్ ఇటీవల మూడో సీజన్‌ను కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించిన ఈ మూడో సీజన్‌కు రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్‌‌గా నిలిచాడు. మొదటి నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా.. చివర్లో అనూహ్యంగా పుంజుకుని టైటిల్ గెలిచాడని కొందరు రాహుల్‌పై సాఫ్ట్ కార్నర్ చూపిస్తుంటే.. మరికొందరు రాహుల్ అసలు టైటిల్‌కు అర్హుడు కాదని సైటర్లు కూడా వేశారు. ఇదంతా పక్కన పెడితే.. మొదటి సీజన్ నుంచి చూస్తూ వస్తే.. […]

బిగ్ బాస్: శ్రీముఖికి నిజంగానే అన్యాయం జరిగిందా.?
Follow us

|

Updated on: Nov 06, 2019 | 7:19 PM

తెలుగు బిగ్ బాస్ ఇటీవల మూడో సీజన్‌ను కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించిన ఈ మూడో సీజన్‌కు రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్‌‌గా నిలిచాడు. మొదటి నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా.. చివర్లో అనూహ్యంగా పుంజుకుని టైటిల్ గెలిచాడని కొందరు రాహుల్‌పై సాఫ్ట్ కార్నర్ చూపిస్తుంటే.. మరికొందరు రాహుల్ అసలు టైటిల్‌కు అర్హుడు కాదని సైటర్లు కూడా వేశారు. ఇదంతా పక్కన పెడితే.. మొదటి సీజన్ నుంచి చూస్తూ వస్తే.. బిగ్ బాస్ షో నిర్వాహకులు మహిళలపై చిన్న చూపు చూస్తున్నారా అంటే..? అవునని కొంతమంది వాదన.

మొదటి సీజన్‌లో నటి హరితేజ చివర్లో ఎందరో అభిమానుల మనసులు గెలుచుకుంటూ.. ఒక్కో అడుగు టైటిల్ దిశగా అడుగులు వేసింది. అయితే అప్పుడు అనూహ్యంగా శివబాలాజీ లైమ్ లైట్‌లోకి వచ్చి టైటిల్ ఎగరేసుకుపోయాడు. అతని గెలుపుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సాయం పరోక్షంగా ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు.

ఇక రెండో సీజన్ విషయానికి వస్తే.. నటుడు కౌశల్ సీజన్ మొత్తం వన్ మ్యాన్ షో నడిపినా.. అతని పేరుతో ఏర్పడిన ‘కౌశల్ ఆర్మీ’ ఓటింగ్ సిస్టమ్‌ను  శాసించినా.. సింగర్ గీతా మాధురి అన్ని అవరోధాలను ఎదుర్కుంటూ ఫైనల్‌కు చేరింది. కానీ టైటిల్ దగ్గర మాత్రం ఆమెకు చుక్కెదురయ్యింది.

మరోవైపు థర్డ్ సీజన్‌లో యాంకర్ శ్రీముఖి టైటిల్ కైవసం చేసుకుంటుందని ముందు నుంచి అందరూ అభిప్రాయపడ్డారు. కానీ రాహుల్ సిప్లిగంజ్‌ విన్నర్ అయ్యాడు. శ్రీముఖి.. ప్రతి టాస్క్‌లోనూ గట్టి పోటీ ఇచ్చింది. ఆమెకు బయట కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ టైటిల్ మాత్రం రాహుల్‌నే వరించింది. శ్రీముఖి రన్నరప్‌గా మిగిలిపోయింది. కాగా, బిగ్ బాస్ షో నిర్వాహకులు పురుషులను మాత్రమే గెలిపిస్తారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. అది సరికాదని, హౌస్‌లోని వారికి వచ్చే ఓటింగ్ శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారన్న విషయాన్ని మరువరాదని మరికొందరు అంటున్నారు.