ఏపీలో రంగుల వివాదం.. వైసీపీ రంగులు తీసేసి ఆ కలర్ వేస్తున్నారట!

హైకోర్టు ఇచ్చిన సూచనలతో ప్రభుత్వం రంగులు మారుస్తోందట. ఇప్పటికే గ్రామ సచివాలయాలకు రంగులు మారుస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే గుంటూరు జిల్లాలో ఉన్న గ్రామ సచివాలయాలకి మాత్రం..

ఏపీలో రంగుల వివాదం.. వైసీపీ రంగులు తీసేసి ఆ కలర్ వేస్తున్నారట!
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2020 | 3:11 PM

ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులను వేయడం గత కొద్ది రోజుల నుంచి తీవ్ర దుమారంగా మారింది. స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా ఉండటంతో దీనిపై హైకోర్టు కూడా స్పందించింది. ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీంతో సీఎం జగన్ మూడు వారాల్లోపు అన్ని ప్రభుత్వం కార్యాలయాలకు ఉన్న వైసీపీ రంగులను తొలగించాలని ఆదేశించారు. కాగా ఇప్పుడు ఇదే విషయంపై మరో పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి.

హైకోర్టు ఇచ్చిన సూచనలతో ప్రభుత్వం రంగులు మారుస్తోందట. ఇప్పటికే గ్రామ సచివాలయాలకు రంగులు మారుస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే గుంటూరు జిల్లాలో ఉన్న గ్రామ సచివాలయాలకి మాత్రం బ్లూ, గ్రీన్, కాషాయం రంగులు వేస్తున్నారట. ఈ వీడియోను మాజీ మంత్రి ఆలపాటి రాజా ఓ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన వీడియోలో మాట్లాడుతూ.. హైకోర్టు మార్చమందని తప్పించి.. పెద్దగా మార్పులేమీ లేవని.. ఈ మాత్రం దానికి రంగులు వేయడం దేనికి? అది కూడా వేయకుండా ఉంటే ఆ డబ్బుల ఖర్చులైనా మిగులుతాయి అని పేర్కొన్నారు. వైసీపీ రంగు కలిసేలా తెనాలి నియోజకవర్గం హునుమాన్ పాలెంలో పంచాయతీ భవనానికి కొత్తగా రంగులు వేసిన ప్రభుత్వ అధికారులు అంటూ వీడియోను పోస్ట్ చేశారు మాజీ మంత్రి ఆలపాటి తెలిపారు.

Read More: 

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..