Breaking News
  • మద్యం ఎక్కువ వినియోగం ఉన్న ప్రాంతాల్లో.. మద్యం షాపులను తగ్గించలేదు-అచ్చెన్నాయుడు. సేల్స్ లేని చోట మాత్రమే షాపులు తగ్గించారు-అచ్చెన్నాయుడు.
  • ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.
  • గుంటూరు: మైనర్‌ బాలికపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. అసెంబ్లీలో దిశ బిల్లు పెట్టిన రోజే ఘటన జరగడం దారుణం-చంద్రబాబు దిశ చట్టం తెచ్చారు.. 21 రోజుల్లో ఉరి అన్నారు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు దిశ విషయంలో చూపిన శ్రద్ధ.. మైనర్‌ బాలికపై ఎందుకు చూపడంలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బాధిత కుటుంబానికి టీడీపీ తరపున రూ.50 వేల ఆర్థికసాయం-చంద్రబాబు.
  • ఆర్టీసీ విలీనంపై టైమ్‌బాండ్‌ పెట్టి కమిటీని నియమించాం-పేర్ని నాని. కమిటీ నివేదిక వచ్చాక ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కొత్త చట్టం తెస్తున్నాం. 200 రోజుల్లోనే జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు-పేర్ని నాని. ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. జనవరి 1లోగా ప్రజా రవాణాశాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం-పేర్ని నాని.
  • రేపు యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన.
  • జులై 1వ తేదీ నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ నివేదిక. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం మద్యం షాపులు తగ్గించాం. ప్రస్తుతం 3,456 షాపులకు కుదించాం-సీఎం జగన్‌. 43 వేల బెల్ట్‌ షాపులను ఎత్తివేశాం-సీఎం జగన్‌. ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. సభను తప్పుదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు. అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నా-జగన్‌. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.

అయోధ్యకేసుపై కీలక వ్యాఖ్యలు..కొత్త సీజె ఏమన్నారంటే?

designated cji crucial comments, అయోధ్యకేసుపై కీలక వ్యాఖ్యలు..కొత్త సీజె ఏమన్నారంటే?

సుదీర్ఘ కాలంగా నానుతున్న అయోధ్య కేసులో త్వరలో తీర్పు వెలువడనున్న తరుణంలో సుప్రీం కోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే అత్యంత కీలకమైన కామెంట్లు చేశారు. అక్టోబర్ 16న వాదనలు ముగిసిన, కేసు రిజర్వు చేసిన నేపథ్యంలో అటు అయోధ్యలోను, ఇటు దేశ రాజధానిలోకి కొన్ని సున్నిత ప్రాంతాల్లోను టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈక్రమంలో కాబోయే చీఫ్ జస్టిస్ బొబ్డే అయోధ్య కేసు విషయంలో చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపాయి.

designated cji crucial comments, అయోధ్యకేసుపై కీలక వ్యాఖ్యలు..కొత్త సీజె ఏమన్నారంటే?

1992 డిసెంబర్ 6వ తేదీన వివాదాస్పద కట్టడాన్ని కూల్చి, రామ్ లల్లా గుడిని తాత్కాలికంగా నిర్మించిన దరిమిలా మొదలైన అయోధ్య కేసు విచారణ.. అంతకు దశాబ్దాలుగా నానుతున్న వివాదాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆ తర్వాత సుదీర్ఘంగా సాగిన విచారణకు ఇక ముగింపు పలకాలని భావించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజయ్ గగోయ్ తన సారథ్యంలోనే అయిదుగురు సభ్యులున్న సుప్రీం ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు విచారిస్తామంటూ 40 రోజుల పాటు అందరి వాదనలు విన్నది ధర్మాసనం. ఈ వాదనల పర్వం ఇటీవల అక్టోబర్ 16వ తేదీన ముగిసింది. నవంబర్ 17నాటికి అంటే ధర్మాసనానికి సారథ్యం వహిస్తున్న చీఫ్ జస్టిస్ రంజయ్ గగోయ్ పదవీ విరమణ చేసే లోగా తీర్పు వెలువరిస్తామన్న సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు.

ఈనేపథ్యంలోనే సుప్రీం కోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్‌గా శరద్ అరవింద్ బొబ్డే నియమితులయ్యారు. ఆయన నవంబర్ 17న భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈక్రమంలో ఆయన పలు జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడారు. ‘‘అయోధ్య కేసు ప్రపంచ చరిత్రలోనే ఓ అతి కీలకమైన, అతి సున్నిత కేసుల్లో ఒకటి ’’ అని బొబ్డే అభిప్రాయపడ్డారు. త్వరలో పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో బొబ్డే అయోధ్య కేసుపై చేసిన ఈ వ్యాఖ్యలు సుప్రీం కోర్టు ఈ వివాదంపై త్వరలో ఏం తీర్పు చెప్పబోతుందో అన్ని ఉత్కంఠను రెట్టింపు చేశాయి.