ఏపీలో కొత్త బార్ల రూల్స్ ఇవే..!

APలో ప్రస్తుతమున్న బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ.. కొత్త బార్ల పాలసీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. మద్య నిషేధాన్ని దశలవారీగా అమల్లోకి తీసుకురావాలని.. యోచిస్తోన్న జగన్ ప్రభుత్వం.. కొత్త బార్ల పాలసీని తీసుకొస్తూ.. 797 బార్ల సంఖ్యను 40 శాతం దాకా తగ్గిస్తోంది. వీటికి 10 లక్షల దరఖాస్తు రుసుంగా పేర్కొంది. అలాగే.. జనవరి 1 నుంచి ఈ కొత్త బార్ల పాలసీ అమలు కానుంది. అన్ని స్టార్ హోటళ్లతో సహా.. ఉదయం 11 నుంచి […]

ఏపీలో కొత్త బార్ల రూల్స్ ఇవే..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 23, 2019 | 12:38 PM

APలో ప్రస్తుతమున్న బార్ల లైసెన్సులను రద్దు చేస్తూ.. కొత్త బార్ల పాలసీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. మద్య నిషేధాన్ని దశలవారీగా అమల్లోకి తీసుకురావాలని.. యోచిస్తోన్న జగన్ ప్రభుత్వం.. కొత్త బార్ల పాలసీని తీసుకొస్తూ.. 797 బార్ల సంఖ్యను 40 శాతం దాకా తగ్గిస్తోంది. వీటికి 10 లక్షల దరఖాస్తు రుసుంగా పేర్కొంది. అలాగే.. జనవరి 1 నుంచి ఈ కొత్త బార్ల పాలసీ అమలు కానుంది. అన్ని స్టార్ హోటళ్లతో సహా.. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే.. బార్లకు సమయాన్ని కేటాయించింది.

లాటరీ పద్దతిలో.. కొత్త బార్లను లాటరీ పద్దతిలో కేటాయించబోతుంది ప్రభుత్వం. ప్రస్తుం ఉన్న 797 బార్లలో 40 శాతాన్ని ప్రభుత్వం తొలగించింది. అలాగే.. మద్యం రేట్లను కూడా భారీగా పెంచనుంది. అందువల్ల మద్యం తాగే వారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావన. కాగా.. ఈ నియమాలు గనుక ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తానికి.. నిజంగానే.. ఏపీలో మందు చేధుగా మారనుంది.