Facebook New APP: ఫేస్‌బుక్ నుంచి కొత్త యాప్.. ఫీచర్లు తెలుసా..!

Facebook New APP: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్  కొత్త యాప్‌ను విడుదల చేసింది. హాబీ(HOBBI) పేరుతో వచ్చిన ఈ యాప్‌లో  మనకు సంబంధించిన హాబీలను ఫొటోలు, వీడియోలుగా షేర్ చేసుకోవచ్చు. ఇదే తరహాలో ఇప్పటికే  ‘Pinterest’ ఉండగా.. ‘HOBBI’ కూడా అలానే పనియనుంది. కాగా ప్రస్తుతానికి ఇది కేవలం యాపిల్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాదు కేవలం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే దీన్ని విడుదల చేశారు. త్వరలోనే అన్ని దేశాల వారికి […]

Facebook New APP: ఫేస్‌బుక్ నుంచి కొత్త యాప్.. ఫీచర్లు తెలుసా..!
Follow us

| Edited By:

Updated on: Feb 15, 2020 | 7:56 AM

Facebook New APP: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్  కొత్త యాప్‌ను విడుదల చేసింది. హాబీ(HOBBI) పేరుతో వచ్చిన ఈ యాప్‌లో  మనకు సంబంధించిన హాబీలను ఫొటోలు, వీడియోలుగా షేర్ చేసుకోవచ్చు. ఇదే తరహాలో ఇప్పటికే  ‘Pinterest’ ఉండగా.. ‘HOBBI’ కూడా అలానే పనియనుంది. కాగా ప్రస్తుతానికి ఇది కేవలం యాపిల్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాదు కేవలం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే దీన్ని విడుదల చేశారు. త్వరలోనే అన్ని దేశాల వారికి అందుబాటులోకి రానుందని.. ఆండ్రాయిడ్‌ యాప్‌ను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

కాగా ఫేస్‌బుక్ కంపెనీలో భాగమైన ‘న్యూ ప్రొడక్ట్ ఎక్స్ పెరిమెంటేషన్ (ఎన్ పీఈ) టీమ్ ఆధ్వర్యంలో ఈ ‘HOBBI’ యాప్ రూపొందింది. అయితే ఈ యాప్‌ను పెద్దగా ప్రచారం లేకుండా విడుదల చేయడం విశేషం. దీంతో శుక్రవారం సాయంత్రం వరకు ‘HOBBI’ను ఐదువేల మంది మాత్రమే డౌన్ లోడ్ చేసుకున్నారు.

‘HOBBI’ యాప్ ద్వారా మనకు ఇష్టమైన గార్డెనింగ్, వంట, ఆర్ట్స్, డెకరేషన్ ఇలాంటి హాబీలను ఓ క్రమంలో సెట్ చేసుకోవచ్చు. తమ కలెక్షన్లు, ప్రాజెక్టులను ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ తోడ్పడుతుందని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఈ కలెక్షన్లు, ప్రాజెక్టులు పూర్తయ్యాక.. వాటిని వీడియో హైలైట్ రీల్స్ రూపొందించుకొని, మరికొందరు యూజర్లతో షేర్ చేసుకోవచ్చని ఆ సంస్థ వెల్లడించింది.