జులై 1 నుంచి ఏపీలో కొత్త అంబులెన్స్‌ సర్వీసులు ప్రారంభం..

జులై 1 నుంచి ఏపీలో కొత్త ఆంబులెన్స్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరిన్ని 108, 104 ఆంబులెన్స్ వాహనాలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అత్యధునాతన సౌకర్యాలతో కూడిన 1,060 వాహనాలు జులై 1 నుంచి...

జులై 1 నుంచి ఏపీలో కొత్త అంబులెన్స్‌ సర్వీసులు ప్రారంభం..
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2020 | 2:19 PM

జులై 1 నుంచి ఏపీలో కొత్త ఆంబులెన్స్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరిన్ని 108, 104 ఆంబులెన్స్ వాహనాలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అత్యధునాతన సౌకర్యాలతో కూడిన 1,060 వాహనాలు జులై 1 నుంచి రోడ్డెక్కనున్నాయి. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద కొత్త వాహనాలకు జెండా ఊపి సీఎం జగన్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ప్రతీ మారుమూల గ్రామానికీ వైద్య సేవలు విస్తరించాలని జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కొత్తగా అంబులెన్స్‌లను కూడా కొనుగోలు చేసింది. వీటి కోసం డ్రైవర్లను, సిబ్బందిని కూడా నియమించింది. దీంతో జులై 1వ తేదీ నుంచి ఏపీలో రాష్ట్రంలో కొత్త ఆంబులెన్సులు ప్రారంభం కానున్నాయి.

కాగా అటు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 793 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 706 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందినవి 87 ఉన్నాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 13,891కి చేరింది. ఇందులో 7,479 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,232 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 180కి చేరింది.

Read More:

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ బుకింగ్ ప్రారంభం..