Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

మాస్కుల స్థానంలో ‘ఆక్సిజెనో’.. ఆరోగ్యానికి ఎంతో మేలు..

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. అయితే.. క‌రోనా వ్యాప్తి నిరోధానికి మాస్కులు
Oxigeno Mask, మాస్కుల స్థానంలో ‘ఆక్సిజెనో’.. ఆరోగ్యానికి ఎంతో మేలు..

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. అయితే.. క‌రోనా వ్యాప్తి నిరోధానికి మాస్కులు ధరించడం వల్ల ప‌లువురికి శ్వాస సంబంధిత స‌మస్య‌లు త‌లెత్తుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు తొలిసారిగా బహుళప్ర‌యోజ‌న‌క‌ర‌ ఆల్గే ఆధారిత రెస్పిరేటర్ ఆక్సిజెనోను అభివృద్ధి చేశారు.

వివరాల్లోకెళితే.. కాలుష్య కారకమైన గాలిలో ఉన్న 99.3 శాతం హానికర వాయువులను, కణ పదార్థాలను తటస్థం చేయడమే కాకుండా, శ‌రీరానికి అందే ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. ఈ ప్రాజెక్టును చేప‌ట్టిన‌ పరిశోధనా బృందంలో దీపక్ దేబ్, అనంత్ కుమార్ రాజ్‌పుత్, మనీష్ కోట్ని, విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జస్టిన్ సామ్యూల్ ఉన్నారు. దీపక్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఇప్పటికే అందుబాటులో ఉన్న‌ఉన్న ఎన్-95 లేదా శస్త్రచికిత్స మాస్కులు కాలుష్య కారకాలను, సూక్ష్మజీవులను ఫిల్టర్ చేస్తాయి.

కాగా.. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నత్రజని, సల్ఫర్ డయాక్సైడ్ త‌దిత‌ర వాయువులను ఇవి ఫిల్టర్ చేయవ‌ని తెలిపారు. అయితే ఆక్సిజెనో నాలుగు పొరల సహాయంతో 10 మైక్రోమీటర్ల నుండి 0.44 మైక్రోమీటర్ల వరకు కణాలను ఫిల్టర్ చేయగలదు. దీని హెపా ఫిల్టర్ దుమ్ము కణాలను ఫిల్టర్ చేస్తుంది, ఉత్తేజిత కార్బన్ ఫిల్టర్లు వాసనలు, హానికరమైన కాలుష్య వాయువులను ఫిల్టర్ చేస్తుంది ఈ ఆక్సిజెనో ఉబ్బసం రోగులకు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడేవారికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.

Also Read: త్వరలో.. మార్కెట్లోకి కరోనావైరస్ టెస్ట్ కిట్.. 10 నిమిషాల్లో ఫలితం.. 

 

Related Tags