కర్నూలు ఎయిర్ పోర్టులో ఇకపై నైట్ ల్యాండింగ్స్!

ఏపీలోని కర్నూలు ఎయిర్ పోర్టులో రాత్రిపూట విమానాలు ల్యాండింగ్ అయ్యేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం అంతర్జాతీయ స్ధాయి ఆటోమేటిక్ ఏటీసీ సిస్టమ్ (ఆటాస్) ను ఏర్పాటు చేస్తోంది. దీంతో ఇకపై నాన్ షెడ్యూల్ విమానాలు సైతం ఇక్కడ రాత్రిపూట కూడా దిగేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. కర్నూలు ఎయిర్ పోర్టులో వైమానిక ట్రాఫిక్ ను పెంచే లక్ష్యంతో విమానాల నైట్ ల్యాండింగ్ కు అవకాశం కల్పిస్తూ ఇప్పటికే డీజీసీఏ అనుమతి తీసుకుంది. కాగా […]

కర్నూలు ఎయిర్ పోర్టులో ఇకపై నైట్ ల్యాండింగ్స్!
Follow us

|

Updated on: Aug 11, 2019 | 4:26 AM

ఏపీలోని కర్నూలు ఎయిర్ పోర్టులో రాత్రిపూట విమానాలు ల్యాండింగ్ అయ్యేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం అంతర్జాతీయ స్ధాయి ఆటోమేటిక్ ఏటీసీ సిస్టమ్ (ఆటాస్) ను ఏర్పాటు చేస్తోంది. దీంతో ఇకపై నాన్ షెడ్యూల్ విమానాలు సైతం ఇక్కడ రాత్రిపూట కూడా దిగేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

కర్నూలు ఎయిర్ పోర్టులో వైమానిక ట్రాఫిక్ ను పెంచే లక్ష్యంతో విమానాల నైట్ ల్యాండింగ్ కు అవకాశం కల్పిస్తూ ఇప్పటికే డీజీసీఏ అనుమతి తీసుకుంది. కాగా నైట్ ల్యాండింగ్ కోసం ప్రభుత్వం అందుకు అవసరమైన అంతర్జాతీయ స్ధాయి సాంకేతిక ఏర్పాట్లను కూడా చేస్తోంది. అంతర్జాతీయంగా అత్యుత్తమ టెక్నాలజీగా పేరు తెచ్చుకుని, అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ( FAA) అమోదం కలిగిన ఆటోమేటిక్ ఏటీసీ సిస్టమ్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది.