ధోనీ తక్కువ అంచనా వేయొద్దు- మైకేల్‌ క్లార్క్‌

దిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్ల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది. ఇటీవలే షేన్ వార్న్ ధోనీని ఆకాశానికి ఎత్తగా…తాజాగా ధోని ప్రాముఖ్యాన్ని తక్కువ చేయొద్దని ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్‌ క్లార్క్‌ విమర్శకులను హెచ్చరించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు అతడి అవసరం ఎంతైనా ఉందన్నాడు. ఆసీస్‌ చేతిలో 2-3 తేడాతో టీమిండియా సిరీస్‌ ఓటమి తర్వాత క్లార్క్‌ ట్వీట్‌ చేశాడు.‘ఎంఎస్‌ ధోనీ ప్రాముఖ్యాన్ని తక్కువ అంచనా వేయకండి. మధ్య […]

ధోనీ తక్కువ అంచనా వేయొద్దు- మైకేల్‌ క్లార్క్‌
Follow us

|

Updated on: Mar 15, 2019 | 9:46 AM

దిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్ల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది. ఇటీవలే షేన్ వార్న్ ధోనీని ఆకాశానికి ఎత్తగా…తాజాగా ధోని ప్రాముఖ్యాన్ని తక్కువ చేయొద్దని ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్‌ క్లార్క్‌ విమర్శకులను హెచ్చరించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు అతడి అవసరం ఎంతైనా ఉందన్నాడు. ఆసీస్‌ చేతిలో 2-3 తేడాతో టీమిండియా సిరీస్‌ ఓటమి తర్వాత క్లార్క్‌ ట్వీట్‌ చేశాడు.‘ఎంఎస్‌ ధోనీ ప్రాముఖ్యాన్ని తక్కువ అంచనా వేయకండి. మధ్య ఓవర్లలో అతడి అనుభవం అత్యంత కీలకం’ అని క్లార్క్‌ ట్వీట్‌ చేశాడు. మహీ భారత్‌కు రెండు సార్లు వరల్డ్ కప్ అందించాడని గుర్తుచేశాడు. ఎన్నో సార్లు తన అనుభవంతో మ్యాచ్‌లను మలుపు తిప్పాడని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో అతడి సలహాలు విరాట్‌ కోహ్లీకి ఉపయోగపడతాయని క్లార్క్‌ వెల్లడించాడు.

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 2-0తో ముందంజలో ఉన్న టీమిండియా 2-3తో ఓటమి పాలైంది. చివరి రెండు వన్డేల్లో ధోనీ ఆడలేదు. అతడి స్థానంలో రిషబ్‌ పంత్‌కు అవకాశం ఇచ్చారు. యువ వికెట్‌ కీపర్‌ చేసిన కొన్ని పొరపాట్లకు జట్టుకు కాస్త ఇబ్బందికి గురి చేశాయి. యాదృచ్ఛికంగా మహీ ఆడని రెండు మ్యాచుల్లోనూ కోహ్లీసేన పరాజయం పాలవ్వడం గమనార్హం.

IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన