మా నాన్న నోరు నొక్కుతున్నారుః కార్తీ చిదంబరం

Karthi Chidambaram Comments On Chidambaram Case, మా నాన్న నోరు నొక్కుతున్నారుః కార్తీ చిదంబరం

తండ్రీ కొడుకులిద్దర్నీ ఒకే కేసు ‘ చుట్టుముట్టింది ‘. ఏనాడో చేసిన ‘ అనుచితానికి ‘ ఫలితం రివర్స్ లో వచ్చి వేధిస్తోంది. తండ్రిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన కుమారుడు కూడా కేంద్ర ‘ బిందువై ‘ ఆయన ‘ రక్షణ ‘ కు నడుం కట్టాల్సి వచ్చింది. మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీకి సంబంధించినదే ఇదంతా.. ఐ ఎన్ ఎక్స్ మీడియా కో-ఫౌండర్లు, మాజీ మీడియా బాస్ లైన పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియా గతంలో ఈ తండ్రీ కొడుకుల పేర్లను ప్రస్తావించడంతో వారికీ, వీరికీ మధ్య ఉన్న లింక్ తిరిగి ‘ తెరపై ప్రత్యక్షమైంది ‘. తాజాగా ఐ ఎన్ ఎక్స్ కేసులో సీబీఐ తన తండ్రిని అరెస్టు చేయడాన్ని ఆయన కొడుకు కార్తీ ఖండించారు. ఇది ఆ దర్యాప్తు సంస్థ అత్యుత్సాహమే అన్నారు. చెన్నై నుంచి గురువారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ బీజేపీ ప్రభుత్వం తనను విమర్శించే వారి నొక్కుతోందని, తన తండ్రి అరెస్టులో ఇదో భాగమని దుయ్యబట్టారు. ‘ నాకు 20 సార్లు సమన్లు జారీ చేశారు. నాలుగు సార్లు నా కార్యాలయాలపై దాడులు జరిగాయి. అయినా వారి కేసు నిలవలేదు ‘ అని ఆయన వ్యాఖ్యానించారు. నేను ఇంద్రాణిని గానీ, పీటర్ ను గానీ ఎన్నడూ కలుసుకోలేదు.. ఒక్కసారి మాత్రం సీబీఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఇంద్రాణి ముఖర్జియా ముంబైలోని బైకుల్లా జైల్లో నాకు తారసపడింది. అని కార్తీ పేర్కొన్నారు. తన తండ్రి అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. మరి ట్రంప్ హస్తం ఉందనుకుంటున్నారా అని సెటైర్ వేశారు.

2007 లో అప్పటి ఆర్ధిక మంత్రిగా చిదంబరం ఉండగా.. ఆ శాఖలో ఫారిన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు చీఫ్ గానూ వ్యవహరించారు. ఆ సమయంలో.ఐ ఎన్ ఎక్స్ మీడియా సంస్థలో భారీ ఎత్తున విదేశీ నిధులను మళ్లించడానికి ఆ పదవి హోదాలో ఆయన అనుమతించారని ఆరోపణలు వచ్చాయి. అదే సందర్భంలో తండ్రి హోదాను అడ్డుపెట్టుకుని కార్తీ ‘ చెలరేగిపోయారని,’ ఆయనకు ఇంద్రాణి, ఆమె భర్త ముడుపులు (కమీషన్లు) చెల్లించారని వార్తలు వచ్చాయి. (షీనా బోరా మర్డర్ కేసులో ఆమె తల్లి ఇంద్రాణి, మారు తండ్రి పీటర్ ముంబై జైల్లో శిక్షఅనుభవిస్తున్నారు.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *