Breaking News
  • అమరావతి: భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు. ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐడీ. 796 తెల్ల రేషన్‌కార్డు దారులపై కేసు నమోదు. రూ.3 కోట్లకు ఎకరం భూమి కొనుగోలు చేసిన తెల్ల రేషన్‌కార్డు దారులు. రూ.300 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్టు గుర్తించిన సీఐడీ. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసిన సీఐడీ. మొత్తం 129 ఎకరాలు కొన్న 131 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు. పెద్దకాకానిలో 40 ఎకరాలు కొన్న 43 మంది. తాడికొండలో 180 ఎకరాలు కొనుగోలు చేసిన 188 మంది. తుళ్లూరులో 243 ఎకరాలు కొన్న 238 మంది. మంగళగిరిలో 133 ఎకరాలు కొనుగోలుచేసిన 148 మంది. తాడేపల్లిలో 24 ఎకరాలు కొన్న 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు.
  • కడప: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై అమరావతి జేఏసీ నేతల ఆగ్రహం. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమాలు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం హర్షణీయం. మండలి చైర్మన్‌ పట్ల మంత్రుల తీరు బాధాకరం. ప్రజలే బుద్ధి చెబుతారు-జేఏసీ నేతలు రమణ, శ్రీనివాసులురెడ్డి.
  • నాపై ఆరోపణలు అవాస్తవం-ప్రత్తిపాటి పుల్లారావు. నాపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై న్యాయ పోరాటం చేస్తా. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగితే కేసులు పెట్టండి. తప్పు చేయకుండా కేసులు పెట్టడం అన్యాయం-ప్రత్తిపాటి.
  • అమరావతి: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌కు భారీగా రాజధాని రైతులు. చంద్రబాబు, లోకేష్‌ను అభినందించిన రైతులు, కార్యకర్తలు. లోకేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. రైతులకు మద్దతుగా జన్మదిన వేడుకలకు దూరంగా లోకేష్‌.
  • ప.గో: పాలకొల్లులో మండలి చైర్మన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జేఏసీ నేతలు, చైర్మన్‌కు బొకేలు ఇచ్చిన అభినందనలు తెలిపిన జేఏసీ నేతలు.

వంశీకి స్పెషల్ సీటు.. వైసీపీ వ్యూహం అదిరింది బాసూ..!

ycp sending message to tdp mlas, వంశీకి స్పెషల్ సీటు.. వైసీపీ వ్యూహం అదిరింది బాసూ..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. సోమవారం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంగళవారం మరింత న్యూస్ సెంట్రిక్‌గా మారారు. ఎందుకంటే ఆయన అటు టిడిపికి, ఇటు వైసీపీకి సమాన దూరం అంటూ.. స్పీకర్‌ తెలపడంతో ఆయన వంశీకి సెపరేటు సీటు కేటాయించారు. ఒక రకంగా చెప్పాలంటే సభలో ఇండిపెండెంట్‌గా గుర్తించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

వంశీని తటస్థ సభ్యునిగా గుర్తించడం వెనుక వైసీపీ భారీ వ్యూహం వున్నట్లుగా క్లియర్‌గా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మూడు రకాల ప్రయోజనాలను అంఛనా వేసే వైసీపీ ఈ తాజా వ్యూహానికి తెరలేపినట్లు తెలుస్తోంది. వంశీ తెలుగుదేశం పార్టీకి దూరమవుతున్నట్లుగా ప్రకటించి నెలన్నర అవుతోంది. ఈ నెలన్నర కాలంలో రెండు సార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిశారు వంశీ. కానీ వైసీపీలో చేరలేదు. ఎప్పుడు చేరతారు వైసీపీలో అని అడిగితే వంశీ నుంచి చిరునవ్వే సమాధానంగా వస్తోంది.

ఈలోగా ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు వచ్చేశాయి. తొలిరోజు అటు టిడిపి, ఇటు వైసీపీ నేతలు తమ కార్యాలయంలోకి రమ్మంటే తమ దాంట్లోకి రమ్మని వంశీని అడిగారు. ఎటు వైపు వెళ్ళని వంశీ.. నేరుగా స్పీకర్‌ను కలిశారు. తనను తటస్థునిగా గుర్తించాలని కోరారు. దానికి తమ్మినేని కూడా తన అంతరాత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకున్నానంటూ వంశీకి సెపరేటు సీటు కేటాయించేశారు.

మరోవైపు పలువురు టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరయ్యేందుకు సిద్దమవుతున్నారని అమరావతి వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సంఖ్య 6 నుంచి 8 వరకు ఉండవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో గెలిచిన పార్టీకి వీరంతా దూరమవ్వొచ్చు కానీ అనర్హత వేటుకు గురి కావద్దు. దీనికి మధ్యే మార్గమే ఈ ‘తటస్థ’ గుర్తింపు. వంశీని గుర్తించినట్లుగానే టిడిపి నుంచి వచ్చే మరికొందరు ఎమ్మెల్యేలను తటస్థులుగా గుర్తిస్తామన్న సంకేతాన్ని స్పీకర్ ద్వారా పంపించేసింది వైసీపీ.

సో.. గెలిచిన పార్టీని వీడినా అనర్హత వేటు పడనప్పుడు తటస్థులుగా కొనసాగుతూ అధికార పార్టీతో లోపాయికారిగా కలిసి వుండడం బెటరన్నది తాజా మెసేజ్. ఈరకంగా వ్యవహరిస్తే.. పదవికి వచ్చిన ప్రమాదం లేదు.. అదే సమయంలో అధికారపార్టీతోను, ప్రభుత్వంతోను చేయించుకోవాల్సిన ప్రయోజనాలు ఎంచక్కా చక్కబెట్టుకోవచ్చు. ఇది ఎమ్మెల్యేలకు కలిసి వచ్చే అంశం.

ఇలా చేయడం ద్వారా ప్రస్తుతం టిడిపికి మిగిలి వున్న 22 మంది నుంచి ఆరు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను లాగేస్తే.. ఏపీలో తెలుగుదేశం పార్టీ మరింత బలహీనపడడంతోపాటు.. చంద్రబాబుకున్న ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దూరమవుతుంది. ఫలితంగా ఆయన డీలా పడడం, ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ నేతల్లో నైతిక స్థైర్యం దెబ్బతినడం జరుగుతుందన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

అలాగే… జగన్ గతం నుంచి చెబుతూ వస్తున్న మాటపైనే ఆయన కట్టుబడి వున్నట్లుగా రాష్ట్ర ప్రజలకు సందేశం కూడా వెళుతుందన్నది వైసీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. జగన్ ముందు నుంచి ఒకే మాట చెబుతున్నారు. ఏ పార్టీ తరపున గెలిచిన వారైనా తమ పార్టీలో చేరాలంటే పదవికి రాజీనామా చేసి, తిరిగి తమ పార్టీ తరపున గెలవాల్సి వుంటుందన్నది జగన్ మాట. అయితే.. ఎన్నికలు అత్యంత కాస్ట్లీ మ్యాటర్ అయిన నేపథ్యంలో గెలిచిన ఏడాదిలోనే మరోసారి పోటీ చేసేందుకు ఏ ఎమ్మెల్యే ధైర్యం చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ మాట నిలబెట్టుకోవడంతోపాటు గెలిచిన పార్టీ నుంచి జంపయ్యే ఎమ్మెల్యేలకు అనర్హత ముప్పు తప్పించేందుకు వైసీపీ ఈ త్రిముఖ వ్యూహాన్ని తెరమీదికి తెచ్చినట్టు చెప్పుకుంటున్నారు.

సో.. ఈ వింటర్ సెషన్ ముగిసేలోగా.. మరికొందరు టిడిపి ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకే వంశీని తటస్థునిగా పరిగణిస్తూ.. ప్రత్యేక సీటును కేటాయించినట్లు రాజకీయ పరిశీలకులు అంఛనా వేస్తున్నారు.