లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. నెట్‌ఫ్లిక్స్‌ రూ.7.5కోట్ల విరాళం

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి చెందిన కూలీలను ఆదుకునేందుకు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. నెట్‌ఫ్లిక్స్‌ రూ.7.5కోట్ల విరాళం
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2020 | 6:14 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి చెందిన కూలీలను ఆదుకునేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ముందుకొచ్చింది. రూ.7.5కోట్లను ప్రొడ్యూసర్స్‌ గిల్ట్‌ ఆఫ్‌ ఇండియా రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది.

మరోవైపు.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమాలు, సీరియళ్ల షూటింగ్స్‌, వెబ్‌ ప్రొడక్షన్స్‌ తదితర కార్యకలాపాలు నిలిచిపోగా.. వినోద రంగంలో పనిచేసే విద్యుత్తు, ఇతర రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరికి సాయం అందించేందుకు ప్రొడ్యూసర్స్‌ గిల్ట్‌ ఆఫ్‌ ఇండియా రిలీఫ్‌ ఫండ్‌ను ప్రారంభించగా.. నెట్‌ఫ్లిక్స్‌ తనవంతు సాయం చేసింది.