ఇళయదళపతి సినిమా కోసం భారీ డీల్‌ ను సెట్ చేసుకున్న నెట్‌ఫ్లిక్స్.. ఏకంగా 100 కోట్లకు పైగా…

స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మాస్టర్ ఈ సినిమా కోసం  దళపతి ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు...

ఇళయదళపతి సినిమా కోసం భారీ డీల్‌ ను సెట్ చేసుకున్న నెట్‌ఫ్లిక్స్.. ఏకంగా 100  కోట్లకు పైగా...
Follow us

|

Updated on: Nov 28, 2020 | 2:00 PM

స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మాస్టర్ ఈ సినిమా కోసం  దళపతి ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. ఇటీవల విజయ్ నటించిన సినిమాలు వందకోట్ల మార్కును అవలీలగా క్రాస్ చేస్తున్నాయి. దాంతో’మాస్టర్’ సినిమా పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల విడుదలైన’మాస్టర్’టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా’మాస్టర్’‌ డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ‘మాస్టర్’ సినిమాకోసం భారీ మొత్తంలో నిర్మాతలకు నెట్‌ఫ్లిక్స్‌ ఆఫర్ చేసినట్టు సమాచారం.’మాస్టర్’ను ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదని నిర్మాతలు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో తప్పక ఓటీటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇందుకుగానూ నెట్‌ఫ్లిక్స్ 100కోట్లకు పైగానే డీల్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేఅవకాశం ఉంది.