కరోనా భయం.. చైనీయుల ముఖాలకు ప్లాస్టిక్ బాటిల్స్ !

కరోనా వైరస్ భయం చైనీయులను ముంచెత్తుతోంది. చైనాలో ఫేస్ మాస్కులకో కొరత ఏర్పడింది. ఇవి లభించకపోవడంతో అనేకమంది చైనా ప్రయాణికులు ప్లాస్టిక్ బాటిల్స్ ధరించడం ప్రారంభించారు. కొందరు హెల్మెట్లు కూడా ధరిస్తున్నారు. ముఖ్యంగా విమానాశ్రయాల్లో ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వాంకోవర్ ఎయిర్ పోర్టులో ఒక మహిళ తన తలమీద వాటర్ కంటెయినర్ పెట్టుకుని కూర్చుంటే.. హాంకాంగ్ లోని ఓ రైల్వే స్టేషన్ లో ప్లాస్టిక్ కంటెయినర్లు ధరించిన ప్రయాణికులు కనబడుతున్నారు. కొంతమంది తల్లులు తమ పిల్లలను […]

కరోనా భయం.. చైనీయుల ముఖాలకు ప్లాస్టిక్ బాటిల్స్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 29, 2020 | 7:08 PM

కరోనా వైరస్ భయం చైనీయులను ముంచెత్తుతోంది. చైనాలో ఫేస్ మాస్కులకో కొరత ఏర్పడింది. ఇవి లభించకపోవడంతో అనేకమంది చైనా ప్రయాణికులు ప్లాస్టిక్ బాటిల్స్ ధరించడం ప్రారంభించారు. కొందరు హెల్మెట్లు కూడా ధరిస్తున్నారు. ముఖ్యంగా విమానాశ్రయాల్లో ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.

వాంకోవర్ ఎయిర్ పోర్టులో ఒక మహిళ తన తలమీద వాటర్ కంటెయినర్ పెట్టుకుని కూర్చుంటే.. హాంకాంగ్ లోని ఓ రైల్వే స్టేషన్ లో ప్లాస్టిక్ కంటెయినర్లు ధరించిన ప్రయాణికులు కనబడుతున్నారు. కొంతమంది తల్లులు తమ పిల్లలను దోమతెరల్లాంటి  ప్లాస్టిక్ కవర్లతో కప్పేశారు. షాంఘై నుంచి పెర్త్ వెళ్లే విమానం కోసం వెయిట్ చేస్తున్న ఓ ట్రావెలర్..హెల్మెట్ తో తన తలను ‘ కప్పేశాడు’.