నేరేడుచెర్ల మునిసిపల్‌ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ..

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారుతోంది. మొత్తం 15 వార్డుల్లో.. కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలవగా.. టీఆర్ఎస్ కూడా ఏడు స్థానాలు గెలిచింది. ఇక మరో స్థానాన్ని సీపీఎం దక్కించుకుంది. అయితే గెలిచిన సీపీఎం సభ్యుడు హస్తానికి జైకోట్టడంతో.. ఇక చైర్మన్ కాంగ్రెస్ దక్కించుకుంటుందనుకున్నారు. అయితే ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులను రంగంలోకి దించింది. (ఎంపీతో పాటు.. ఎమ్మెల్సీ బొడకుంట్ల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే సైదిరెడ్డి) దీంతో సీన్ రివర్స్ […]

నేరేడుచెర్ల మునిసిపల్‌ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ..
Follow us

| Edited By:

Updated on: Jan 28, 2020 | 8:49 AM

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారుతోంది. మొత్తం 15 వార్డుల్లో.. కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలవగా.. టీఆర్ఎస్ కూడా ఏడు స్థానాలు గెలిచింది. ఇక మరో స్థానాన్ని సీపీఎం దక్కించుకుంది. అయితే గెలిచిన సీపీఎం సభ్యుడు హస్తానికి జైకోట్టడంతో.. ఇక చైర్మన్ కాంగ్రెస్ దక్కించుకుంటుందనుకున్నారు. అయితే ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులను రంగంలోకి దించింది. (ఎంపీతో పాటు.. ఎమ్మెల్సీ బొడకుంట్ల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే సైదిరెడ్డి) దీంతో సీన్ రివర్స్ అయ్యింది. టీఆర్ఎస్ బలం పదికి చేరింది. అయితే కాంగ్రెస్ బలం సీపీఎం సభ్యుడితో కలిసి ఎనిమిది అయ్యింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి.. నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కేవీపీ ఓట్లు కీలకంగా మారాయి. అయితే కేవీపీ ఓటు అనుమతించడంపై టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కేవీపీ ఓటు అనుమతిపై అభ్యంతరం తెలిపాయి. దీంతో నేరేడుచెర్ల మునిసిపల్ చైర్మన్ ఎన్నిక.. ఎంపీ ఉత్తమ్‌, ఎమ్మెల్యే సైదిరెడ్డి మధ్య వాగ్వాదానికి దారితీసింది.

కేవీపీ ఓటుపై నేరేడుచర్ల కమిషనర్‌ ఇచ్చిన ఆర్డర్‌ను ఈసీ రద్దు చేసింది. వివాదాల నడుమ నేరేడుచర్ల మున్సిపాల్టీ చైర్మన్ ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడింది. కాంగ్రెస్, టీఆర్ఎస్‌కు చెరి సమానంగా స్థానాలు ఉండటంతో.. డ్రా ద్వారా చైర్మన్‌ను ఎన్నికోనున్నారు. ఇదిలా ఉంటే.. చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో నేరేడుచర్లలో 144 సెక్షన్‌ను విధించారు. 600 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..