ఇంత దారుణమా.. గుండు గీసి.. ఆ తర్వాత “జై శ్రీరాం” అని రాసి..

యూపీలో కొందరు వ్యక్తులు ఇంకా ఆటవిక చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఓ వైపు దేశం డిజిటల్‌గా దూసుకెళ్తున్నప్పటికీ.. కొందరు మూర్ఖులు చేస్తున్న పనులతో దేశం పరువునే తీసేస్తున్నారు. అందుకు..

ఇంత దారుణమా.. గుండు గీసి.. ఆ తర్వాత జై శ్రీరాం అని రాసి..
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2020 | 4:18 AM

యూపీలో కొందరు వ్యక్తులు ఇంకా ఆటవిక చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఓ వైపు దేశం డిజిటల్‌గా దూసుకెళ్తున్నప్పటికీ.. కొందరు మూర్ఖులు చేస్తున్న పనులతో దేశం పరువునే తీసేస్తున్నారు. అందుకు ఇటీవల యూపీలో జరిగిన ఓ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల నేపాల్ ప్రధాని రాముడు మా నేపాలీ అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలను యావత్ భారతం ఖండించింది. ఆ తర్వాత నేపాలీ ప్రధాని వ్యాఖ్యలపై ఆ దేశం వివరణ కూడా ఇచ్చింది. ఇదంతా ఇలావుంటే.. నేపాల్ ప్రధాని అలా రాముడి గురించి అలా వ్యాఖ్యానిస్తారా..? అంటూ అక్కడి ఓ హిందూ సంస్థకు చెందిన నాయకుడు ఒకరు యూపీలో నివసిస్తున్న నేపాలీ వ్యక్తిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. నేపాల్ ప్రధాని ఓలీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నేపాలీ వ్యక్తికి గుండు గీయించాడు. అంతేకాదు.. అతడి గుండుపై మార్కర్‌ పెన్నుతో జై శ్రీ రాం అని రాయించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఏకంగా ఈ ఘటనపై భారత్‌లోని నేపాల్ రాయబారి నీలాంబర్ ఆచార్య విషయాన్ని యూపీ సీఎం యోగీకు తెలిపారు. దీనిపై స్పందించిన యోగీ.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?