Breaking : నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలికి అస్వస్థత..

నేపాల్ ప్ర‌ధాని కేపీ శర్మ ఓలి బుధవారం తీవ్ర‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు తీవ్ర‌మైన‌ ఛాతి నొప్పి రావడంతో కాఠ్మండూలోని షాహిద్ గంగలాల్ నేషనల్ హార్ట్ సెంటర్‌కు తరలించారు.

Breaking : నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలికి అస్వస్థత..
Follow us

|

Updated on: Jul 01, 2020 | 6:54 PM

నేపాల్ ప్ర‌ధాని కేపీ శర్మ ఓలి బుధవారం తీవ్ర‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు తీవ్ర‌మైన‌ ఛాతి నొప్పి రావడంతో కాఠ్మండూలోని షాహిద్ గంగలాల్ నేషనల్ హార్ట్ సెంటర్‌కు తరలించారు. 68 ఏండ్ల కేపీ శర్మ ఆరోగ్యం ప్ర‌స్తుతం నిలకడగానే ఉంద‌ని వైద్యులు తెలిపిన‌ట్టు సమాచారం. ఈ ఏడాది మార్చిలో ఆయనకు రెండో కిడ్నీ మార్పిడి ఆప‌రేష‌న్ జరిగింది. 2007లో కేపీ శర్మ రెండు కిడ్నీలు పాడ‌వ‌డంతో మొద‌ట‌ ఒక కిడ్నీ మా‌ర్చారు వైద్యులు.

కాగా నేపాల్‌ ప్రధాని ఇటీవల ఇండియాకు వ్యతిరేకంగా అడుగులు వేస్తోన్న‌ సంగతి తెలిసిందే. చైనాతో ఆయ‌న చెలిమి చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌న దేశానికి చెందిన కొన్ని ప్రాంతాల‌ను నేపాల్‌కు చెందినవిగా పేర్కొంటూ ఇటీవల ఆ దేశం కొత్త మ్యాప్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. నేపాల్ ఉభ‌య స‌భలు కూడా ఈ మ్యాపును ఆమోదించాయి. ఈ మ్యాప్‌పై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

మరోవైపు నేపాల్‌ పార్లమెంట్‌ ఆమోదించిన కొత్త పౌరసత్వ బిల్లును నిర‌శిస్తూ నేపాల్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన జనతా సమాజ్‌బాదీ పార్టీ మంగళవారం నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి కేపీ శర్మ రిజైన్ చెయ్యాలని..సొంత పార్టీకి చెందిన‌ కొందరు నేతలు బుధవారం డిమాండ్‌ చేశారు. అయితే తనను ప్రధాని పదవి నుంచి దించేందుకు ఇండియా ప్ర‌య‌త్నాలు చేస్తోందని కేపీ శర్మ ఆరోపించారు.