‘అయోధ్యా ధామ్’ నిర్మిస్తా, నేపాల్ ప్రధాని ఓలి

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఈ నెల 5 న ప్రధాని మోదీ భూమిపూజ చేయడంతో పొరుగునున్న నేపాల్ కి కన్ను కుట్టినట్టు ఉంది. అసలైన అయోధ్య నేపాల్ లోనే ఉందని, ఇండియాలో కాదని చెప్పుకుంటున్న ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి...

'అయోధ్యా ధామ్' నిర్మిస్తా, నేపాల్ ప్రధాని ఓలి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 10, 2020 | 2:13 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఈ నెల 5 న ప్రధాని మోదీ భూమిపూజ చేయడంతో పొరుగునున్న నేపాల్ కి కన్ను కుట్టినట్టు ఉంది. అసలైన అయోధ్య నేపాల్ లోనే ఉందని, ఇండియాలో కాదని చెప్పుకుంటున్న ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి..తాను కూడా తమ దేశంలో ‘అయోధ్యా ధామ్’ నిర్మించే యోచనకు శ్రీకారం చుట్టారు. రామనవమి రోజున ‘అయోధ్యాపురి’ లో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ప్లాన్ లో ఉన్నారాయన. అక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివార్ల విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తారట.

చిత్వాన్ జిల్లాలోని థోరి మున్సిపాలిటీ ప్రాంతాన్ని ‘అయోధ్యాపురి’గా పేరు మార్చాలని ఓలి తమ అధికారులను ఆదేశించారు. దసరా సందర్భంగా వచ్ఛే నవమి నాడు ఈ ప్రాంతంలో ఓలి భూమిపూజ చేస్తారని, ఆ నాటి నుంచి ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దీన్ని అయోధ్యా ధామ్ గా వ్యవహరిస్తారని సమాచారం.