యువకుడితో హిజ్రా సహజీవనం, పెళ్లికి నో చెప్పడంతో
ఓ యువకుడిని మనసారా ప్రేమించిన ఓ హిజ్రా.. అతడు మరో యువతితో పెళ్లికి సిద్దపడటంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.
ఓ యువకుడిని మనసారా ప్రేమించిన హిజ్రా.. అతడు మరో యువతితో పెళ్లికి సిద్దపడటంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం కొత్తూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తూరు గ్రామానికి చెందిన హిజ్రా నరేష్ అలియాస్ దివ్య.. దినేష్ అనే యువకుడిని కొంతకాలంగా ప్రేమిస్తోంది. అతడు కూడా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. అయితే దినేష్ ఇటీవలే మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్దపడ్డాడు. ఈ విషయం తెలియడంతో దివ్య తట్టుకోలేకపోయింది. వెంటనే దినేష్ను నిలదీసింది. నువ్వు లేకుండా జీవించలేనని వేడుకుంది. తనతో ఉండాలని, పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ దినేష్ అందుకు ఒప్పుకోలేదు. పెళ్లి పనులు ప్రారంభించాడు.
దీంతో తాను ఎంతో ప్రేమించిన దినేష్ ఇక తనతో ఉండడని దివ్య తీవ్ర మానసిక వ్యధను అనుభవించింది. ప్రియుడి ఎడబాటును తట్టుకోలేక ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. దినేష్ కారణంగానే దివ్య ఆత్మహత్య చేసుకుందని.. తండ్రి వేమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read :
వానలే వానలు : మరో అల్పపీడనం, ఏపీకి భారీ వర్ష సూచన
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు దుర్మరణం