Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 8 లక్షల 78 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 878254. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 301609. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 553471. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23174. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • భవిష్యవాణి లో స్వర్ణలత. భక్తులు 5వారాల పాటు శాఖ పోయాలి. పప్పు బెల్లాలతో ప్రతి గడప నుండి నాకు పూజ చేయాలి. నాకు ఈ ఏడు సంతోశమ్ లేదు. ఎవరు చేసుకుంది వారు అనుభవించాల్సిందే. నా ప్రజలని నేను కాపాడత.
  • తూర్పుగోదావరి జిల్లా : జగ్గంపేట నియోజకవర్గం కాపుసోదరులకు మాజీ మంత్రి ముద్రగడ బహిరంగ లేఖ. కాపు ఉద్యమం నుండి తప్పుకోవాలని నిర్ణయించు కొన్నా.. ముద్రగడ . ఇటీవల కొంతమంది సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ల నాపై దాడులు చేస్తున్నారు... ముద్రగడ . నన్ను కులద్రోహి గజదొంగ వంటి మాటలతో విమర్శిస్తున్నారు.. ముద్రగడ . నేను ఉద్యమం లో వసూలు చేసిననిధులు వారికి పంచలేదనా ఆ దాడులు... ముద్రగడ .
  • కరోనా వైరస్ నేపద్యంలో జైల్ లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని హైకోర్టు లో పిల్ . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైల్లో ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలంటూ పిల్ లో పేర్కొన్న పిటిషనర్ లింగయ్య . ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెరోల్ పై విడుదల చేస్తున్నారని, తెలంగాణలో కూడా విడుదల చేసేలా . ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న పిటిషనర్ . మరి కొద్ది సేపటిలో విచారణ చేయున్న హైకోర్టు.
  • గాంధీలో నాలుగో రోజు కొనసాగుతున్న నర్సుల సమ్మె. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్చలతో ఏకీభవించని నర్సులు. విధులు బహిష్కరించిన 200 మంది నర్సులు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా హెడ్ నర్స్ పదోన్నతి పై మండిపాటు.
  • బాలీవుడ్‌లో మరో విషాదం. ముంబై: బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చోక్సీ (29) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆదివారం తుది శ్వాస విడిచారు. దివ్య అకాల మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

నెల్లూరులో చేతబడి కలకలం.. ప్రేమించి పెళ్లిచేసుకున్నాడని..!

నెల్లూరు జిల్లాలో చేతబడి కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని భార్గవ్ అనే వ్యక్తిపై చేతబడి చేసినట్లు అతడి తల్లిదండ్రులు, భార్య ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అతడు తీవ్ర అనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Nellore district news, నెల్లూరులో చేతబడి కలకలం.. ప్రేమించి పెళ్లిచేసుకున్నాడని..!

నెల్లూరు జిల్లాలో చేతబడి కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని భార్గవ్ అనే వ్యక్తిపై చేతబడి చేసినట్లు అతడి తల్లిదండ్రులు, భార్య ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అతడు తీవ్ర అనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరుకు చెందిన ముని భార్గవ్, కావలికి చెందిన ప్రత్యూష ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో రహస్య వివాహం చేసుకున్నారు. అయితే భార్గవ్‌ను వదిలేసి రావాలని ప్రత్యూష తల్లిదండ్రులు ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ భార్గవ్‌ను వదిలి రానని ప్రత్యూష తెగేసి చెప్పింది.

Nellore district news, నెల్లూరులో చేతబడి కలకలం.. ప్రేమించి పెళ్లిచేసుకున్నాడని..!

ఇదిలా ఉంటే ఇటీవల భార్గవ్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడిపై బాణామతి ప్రయోగం చేశారని తల్లిదండ్రులు, భార్య ఆరోపిస్తున్నారు. క్షుద్ర పూజల కారణంగా తమ కుమారుడు అనారోగ్యం పాలయ్యాడని వారు ఆరోపణలు చేస్తున్నారు. కడప జిల్లా కమలాపురంకు చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి క్షుద్ర పూజలు చేసినట్లు భార్గవ్ తండ్రి చెబుతున్నారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను గణపతి పూజ మాత్రమే చేశానని అతడు అంటున్నాడు.

మరోవైపు క్షుద్ర పూజల చేయాల్సిన అవసరం ఏంటని యువతి తల్లిదండ్రుల ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నమ్మకాలతో అబాండాలు వేయడం సరైంది కాదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. హేతువాద సంఘాలు కూడా భార్గవ్ తల్లిదండ్రుల ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Related Tags